బిజినెస్

పూణె ప్లాంటు నుంచి ఒక మిలియన్ కార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 19: చాలాకాలం పాటు మార్కెట్‌లో ఎదురుగాలితో సతమతమైన జర్మనీకి చెందిన వాహనాల దిగ్గజం వోక్స్‌వాగన్ తన అనుబంధ సంస్ధ స్కోడా ద్వారా పునర్వవస్థీకరణ జరిగిన తర్వాత శుక్రవారం ఒక మిలియన్ కార్లను పూనే నుంచి విడుదల చేసింది. పూణెలో ఈ సంస్థ తయారీ యూనిట్ 2010 నుంచి కొనసాగుతోంది. ఏడాదికి 20 వేల కార్ల వంతున పూనే ప్లాంటులో తయారుకాగా ఇందులో పోలో, ఆమియో, వెంటో, స్కోడా ర్యాపిడ్ వంటి మోడళ్లు ఉన్నాయి. కాగా దేశీయ అవసరాలకు అనుగుణంగా కార్లను తయా రు చేయడంతోబాటు ఈ ప్లాంటు నుంచి సుమారు 50 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఇందులో ఆసి యా, ఆఫ్రికా ఖండాలతోబాటు ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా దేశాలున్నాయి. కాగా ఈ మిలియన్ కా ర్ల ‘రోల్ అవుట్’ తమకెంతో విశిష్టమైనదని, మైలురాయిగా భావిస్తున్నామని వోక్స్‌వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గుర్‌ప్రతాప్ బోపారాయ్ ఈ సం దర్భంగా వ్యాఖ్యానించారు. మార్కె ట్ విలువ ఆధారంగా ప్రపంచంలో అతిపెద్ద వాహన తయారీ కం పెనీగా గుర్తింపు పొందిన ఈ వోక్స్‌వ్యాగన్ మనదేశంలో వోక్స్‌వ్యాగన్, వోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్, స్కోడా ఆటోలను లగ్జరీ కార్ల యూని ట్ ఆడీ ఇండియాతోబాటే ఏర్పాటు చేయడం జరిగింది. కాగా ఈ ఘనతను ముందుకు తీసుకెళ్తామని, మరిన్ని మైలురాళ్లను అందుకుంటామని బోపారాయ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్కోడా నేతృత్వంలోని ‘ఇండియా 2.0’ ప్రాజెక్టులో భాగం గా భారత దేశ స్వభావానికి అనుగుణంగా మరిన్ని ఉత్తమ ఉత్పత్తులను తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.