బిజినెస్

నిధులిచ్చి ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 15: నిధులిచ్చి ఆదుకోవాలంటూ ఎస్‌బీఐని, ప్రధాని నరేంద్ర మోదీనీ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు కోరారు. సోమవారం పలువురు పైలెట్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు జెట్ ప్రధాన కార్యాలయం వద్ద సమావేశమై, మేనేజ్‌మెంట్‌కు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం కేవలం ఆరేడు విమానాలతో నడుస్తున్న జెట్ ఎయిర్‌వేస్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని అల్లాడుతున్న విషయం తెలిసిందే. జీతభత్యాలు కూడా సక్రమంగా అందకపోవడంతో, ఉద్యోగులు వీధిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. పైలెట్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు చివరిసారి, గత ఏడాది డిసెంబర్ మాసంలో జీతాలు వచ్చాయి. గత మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో సమస్య తీవ్రతరమవుతున్నదని జెట్ ఎయిర్‌వేస్ ప్రధాన కార్యాలయం వద్ద సమావేశమైన పైలెట్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు పేర్కొన్నారు. తక్షణమే 1,500 కోట్ల రూపాయలను విడుదల చేసి, సంస్థను ఆదుకోవాల్సిందిగా ఈ కంపెనీకి అతి పెద్ద రుణదాత ఎస్‌బీఐని కోరారు. జెట్ ఎయిర్‌వేస్ పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి అవసరమైన పరిస్థితులను కల్పించాలని కోరారు.
అదే విధంగా కంపెనీలో పని చేస్తున్న సుమారు 20,000 మంది తమ ఉపాధి కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సంస్థ యాజమాన్యానికి అండగా ఉంటామని, ఈ కష్టకాలంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకొచ్చి, ఆదుకోవాలని కోరారు. కంపెనీ దివాలా ప్రక్రియ లాంఛనాలను త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
చిత్రం... ముంబయిలోని ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం సమావేశమైన జెట్ ఎయిర్‌వేస్ పైలెట్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు