బిజినెస్

లాభాలతో బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 15: భారత స్టాక్ మార్కెట్ ఈవారం లావాదేవీలకు మొదటి రోజైన సోమవారం లాభాలతో బోణీ చేసింది. అటు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో, ఇటు జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ట్రేడింగ్ లాభాలతో ముగిసింది. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 138.73 పా యింట్లు పెరిగి, 38,905.84 పాయింట్లకు చేరింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 46.90 పాయింట్లు పెరగడంతో, 11,690.35 పాయింట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అద్భుత ఫలితాలు సాధించిన టీసీఎస్ షేర్లు 4.78 శాతం లాభపడ్డాయి. అయితే, అన్నిటికంటే అధికంగా టాటా మోటార్స్ లాభాలను ఆర్జించింది. ఆ కంపెనీ వాటాలు 7.04 శాతం అధిక ధరకు ట్రేడయ్యాయి. టీసీఎస్, టాటా మోటార్స్‌తోపాటు కోల్ ఇండియా, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ కంపెనీలకు చెందిన షేర్లు సగటున 4.78 శాతం లాభాలను ఆర్జించాయి. విదేశీ ద్రవ్య ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగిన కారణంగా, ఆటో, ఐటీ రంగాలు మెరుగైన ఫలితాలను నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 17.7 శాతం సంయుక్త వృద్ధిరేటును సాధించినట్టు టీసీఎస్ ప్రకటించింది. మొత్తం మీద రూ.8,126 కోట్ల లాభాలను ఆర్జించినట్టు కంపెనీ ఫలితాల ప్రకటనలో పేర్కొంది. దీనితో ఆ కంపెనీ షేర్ల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే, టీసీఎస్‌కు గట్టిపోటీనిస్తున్న ఇన్ఫోసిస్ మాత్రం సోమవారం నాటి ట్రేడింగ్‌లో నష్టపోయిన కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతం అభివృద్ధిని, 4,078 కోట్ల రూపాయల లాభాలను ప్రకటించింది. అయితే, మదుపరులు ఎక్కువ లాభాలను ఆర్జించిన టీసీఎస్ వైపు మొగ్గు చూపాయి. దీనితో ఇన్ఫోసిస్ షేర్ల ధర 2.83 శాతం పతనమైంది. ఇన్ఫోసిస్‌తోపాటు సన్ ఫార్మా, ఎస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇలావుంటే, ఆసియాలో జపాన్, చైనా, కొరియా దేశాల్లో మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేవాయి. యూకేలో జర్మనీ, ఫ్రాన్స్, దేశాల్లో ట్రేడింగ్ సానుకూల ధోరణుల మధ్య కొనసాగాయి. అంతర్జాతీయ సూచీలు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల మద్దతుతో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ కూడా లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్‌ను స్థూలంగా పరిశీలిస్తే, భారీ లాభాలుగానీ, భారీ నష్టాలుగానీ లేకుండా ఫ్లాట్‌గానే ముగిసింది.