బిజినెస్

జెట్ ఎయిర్‌వేస్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, న్యూఢిల్లీ, మార్చి 25: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌కు ఆర్థిక ఊతం లభించింది. 26 ఏళ్లపాటు బోర్డు సభ్యునిగా కొనసాగిన వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ సోమవారం రాజీనామా చేసిన నేపథ్యంలో రుణ దాతలు ముందుకు వచ్చి ఈ ఎయిర్‌లైన్స్‌ను గట్టెక్కించేందుకు 1500 కోట్ల తక్షణ సహాయాన్ని ప్రకించించారు. దాదాపు 8000 వేల కోట్ల రూపాయల మేర రుణ భారంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌కు రుణదాతల ఆర్థిక ఊతం కొంత ఊటర కలిగించింది. బ్యాంకు రుణాలను ఈక్విటీలుగా మార్చుకోవడానికి మెజార్టీ వాటాదారులుగా మారే రుణ దాతలను డైరెక్టర్లుగా నియమించేందుకు బోర్డు ఆమోదం లభించింది. రుణ దాతలు తీసుకున్న తాజా నిర్ణయం పట్ల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు మరిన్ని విమానాలు, ఎయిర్‌లైన్స్ అవసరం ఉందని, వాటిని సమకూర్చుకోకపోతే విమాన చార్జీలు పెరిగిపోతాయని అన్నారు. బ్యాంకులు కూడా ఈ సంస్థను కాపాడేందుకే ప్రయత్నించాయని, దీనివల్ల వారి బాకీలు వసూలుకు వీలు కలుగుతుందని జైట్లీ అన్నారు. రుణ పరిష్కార తీర్మానంపై ఎయిర్‌లైన్స్ నిర్ణయం వెలువడ్డాక జైట్లీ మాట్లాడారు. అసలు సంస్థ ఉనికికే అనిశ్చితి ఉన్న పరిస్థితికి తెరదించుతూ రుణాలను ఈక్విటీలుగా మార్చుకోవడానికి బోర్డు ముందుకు రావడంతో జెట్ ఎయిర్‌వేస్ వ్యవహారం సుఖాంతమైంది. నరేష్ గోయల్‌తోబాటు ఆయన భార్య అనితాగోయల్, నామినీ డైరెక్టర్ కెవిన్ నాయక్ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. జెట్ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు 24 శాతం వాటావుంది. అలాగే నరేష్ గోయల్‌కు ఇప్పటి వరకు 51 శాతం వాటా ఉంది. పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ఆయన వాటా 25 శాతానికి, ఎతిహాద్ వాటా 12 శాతానికి తగ్గిపోతుంది. అలాగే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సారధ్యంలోని రుణ దాతల కన్సార్టియం జెట్ ఎయిర్‌వేస్‌లో మెజార్టీ వాటాదారుగా మారుతుందని తెలిసింది.