బిజినెస్

కిరణ్ షా నియామకానికి షేర్‌హోల్డర్ల ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కిరణ్ మజుందార్ షా నియామకానికి షేర్ హోల్డర్లు ఆమోద ముద్ర వేశారు. పాలక మండలి ఇది వరకే ఆమెను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగించాలని నిర్ణయించగా, సోమవారం జరిగిన ఓటింగ్‌లో ఆమెకు తిరుగులేని మద్దతు లభించింది. స్థూలంగా చూస్తే, 92.2 శాతం మంది ఆమె నియామకానికి అనుకూలంగా ఓటు వేస్తే, 7.7 శాతం మంది వ్యతిరేకించారు. పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్ విభాగంలో ఆమెకు 93.57 శాతం ఓట్లు లభించాయి. కేవలం 6.4 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ విభాగంలో నూటికి నూరు శాతం ఓట్లు కిరణ్ షాకు లభించాయి. అయితే, పబ్లిక్ నాన్-ఇన్‌స్టిట్యూషన్ వి భాగంలో మాత్రం ఆమెకు 81 శాతం ఓట్లే దక్కాయి. 18.8 శాతం మంది ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. కిరణ్ షాను మరోసారి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ స్టేక్‌హోల్డర్స్ ఎంపర్‌మెంట్ సర్వీసెస్ (ఎస్‌ఈఎస్) విడుదల చేసిన ఒక ప్రకటన వాటాదారులపై పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఇండిపెండెం ట్ డైరెక్టర్ హోదాలో కిరణ్ షా తీసుకునే నిర్ణయాలు, వాటి ఫలితాలపై ఎస్‌ఈఎస్ వివరణాత్మక విశే్లషణలను ఇచ్చింది. ఇన్ఫోసిస్‌కు ఆమె సేవలు ఎంత వరకు అవసరం అనే ప్రశ్నపై కూలంకషంగా చర్చించింది. అయితే, ఆమెకు ఉన్న వృత్తిపరమైన నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని మాత్రం తక్కువ అంచనా వే యడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఎస్‌ఈఎస్ చేసిన వ్యా ఖ్యల్లో కొన్నింటిని మాత్రమే పరిగణలోకి తీసుకున్న వాటాదారులు ఆమెవైపే మొగ్గు చూపారు. మరోసారి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సేవలు అందించే అవకాశాన్ని కల్పించారు.