బిజినెస్

భారత కాఫీకి ఇటలీలో డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: భారత దేశంలో తయారైన వివిధ రకాలైన కాఫీ బ్రాండ్లకు విదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రత్యేకించి ఇటలీలో భారత కాఫీకి డిమాండ్ ఎక్కువ. వివిధ దేశాలకు జరుగుతున్న కాఫీ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం గణనీయంగా పెరిగింది. గత ఏడాది మార్చి నాటికి 66,817 టన్నుల కాఫీ ఎగుమతికాగా, ఈ ఏడాది, మార్చి ఐదో తేదీ నాటికి 74,811 టన్నుల కాఫీ ఎగుమతి అయింది. గత ఏడాది మొత్తం ఎగుమతుల విలువ 1,020 కోట్ల రూపాయలుకాగా, ఈసారి అది 1,272 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇటలీకి అత్యధికంగా 16,914 టన్నుల కాఫీని భారత్ ఎగుమతి చేసింది. భారత్ కాఫీ ఎగుమతి చేస్తున్న ‘టాప్-10’ జాబితాలో ఇటలీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించగా, ఆతర్వాతి స్థానాల్లో వరుసగా జర్మనీ (7,007 టన్నులు), రష్యా సమాఖ్య (5,230 టన్నులు), బెల్జియం (4,126 టన్నులు), లిబియా (3,999 టన్నులు), జోర్డాన్ (3,192 టన్నులు), పోలాండ్ (2,184 టన్నులు), టర్కీ (2,008 టన్నులు), అమెరికా (1,575 టన్నులు), గ్రీస్ (1,481 టన్నులు) ఉన్నాయి. ఇలావుంటే, ప్రపంచంలోనే కాఫీని అత్యధికంగా పండించే దేశాల్లో భారత్ ఏడో స్థానాన్ని ఆక్రమించింది. బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది. కాఫీ ఉత్పత్తుల టాప్-10 దేశాల్లో వియత్నాం, కొలంబియా, ఇండోనేషియా, ఇథియోపియా, హోండురాస్ వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్‌ది ఏడో స్థానంకాగా, ఉగాండా, మెక్సికో, గాటిమాలా ఎనిమిది నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.