బిజినెస్

లాభాల్లో దేశీయ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 21: వరుసగా రెండోరోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ గురువారం 142.09 పాయింట్లు లాభపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 54.40 పాయింట్లు ఎగబాకింది. విదేశీ, దేశీయ సంస్థాగత మదుపర్లు వాటాల కొనుగోళ్లు కొనసాగించడంతో పార్మా, లోహ, ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ అధికంగా లాభాలను సంతరించుకున్నాయి. 30 షేర్ల సెనె్సక్స్ 0.40 శాతం లాభాలతో 35,898.35 వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 54.40 పాయంటుల లేదా 0.51 శాతం లాభపడి 10,789.85 వద్ద ముగిసింది. సెనె్సక్స్ ప్యాక్‌లో వాహన రంగంలో అత్యధికంగా టాటా మోటార్స్ 2.94 శాతం అదనంగా లాభపడింది. ఈ కంపెనీతోబాటే వేదాంత, బాలాజీ ఫైనాన్స్, సన్ పార్మా, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, రిలయన్స్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ డ్యుయో, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ దాదాపు 2.78 శాతం లాభాలను అందుకున్నాయి. మరోవైపుయెస్‌బ్యాంక్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టీసీఎస్ దాదాపు 1.33 శాతం నష్టపోయాయి. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈ లోహ సూచీతోబాటు, వినిమయ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్, బ్యాంకెక్స్ దాదాపు 1.14 శాతం అదనంగా లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు ఐటీ, టెక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇక బ్రాడర్ సూచీలు సైతం బెంచ్‌మార్కును దాటి లాభాల్లో నమోదు చేశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.88 శాతం ఎగబాకగా, స్మాల్‌క్యాప్ సూచీ 1.07 శాతం లాభాలను నమోదు చేసింది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన నిల్వల సక్రమ నిర్వహణ నిమిత్తం 48,239 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించడం మార్కెట్లకు ఊతమిచ్చిందని వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి.
రూ.713.47 కోట్ల వాటాలు కొన్న విదేశీయులు
విదేశీ సంస్థాగత మదుపర్లు దాదాపు రూ.713.47 కోట్ల విలువైన వాటాలను గురువారం కొనుగోలు చేశారు. గత కొన్ని రోజులుగా వరుసగా వాటాల విక్రయాలకు పాల్పడిన ఈ పెట్టుబడిదార్లు ఇప్పుడు వైఖరి మార్చుకోవడం గమనార్హం. అలాగే దేశీయ సంస్థాగత మదుపర్లు సైతం రూ.113.27 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. కాగా ఆసియా పరిధిలోని హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ 0.41 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.15 వంతున లాభపడగా, షాంఘయ్ కాంపోజిట్ సూచీ 0.34 శాతం, కొరియాకు చెందిన కోస్పి 0.04 శాతం నష్టపోయాయి. యూరప్ పరిధిలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన డీఏఎక్స్ 0.28 శాతం లాభపడింది. ప్యారిస్‌కు చెందిన సీఏడీ-40 0.06 శాతం, లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 0.63 శాతం వంతున నష్టపోయాయి. ముడిచమురు బ్యారల్ ధర 0.12 తగ్గి 67 డాలర్లు పలికింది. భారత రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గి అమెరికన్ డాలర్‌కు 71.14 రూపాయలు పలికింది.