బిజినెస్

నేరుగా ఎరిక్‌సన్‌కే చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: బ్యాంకు అకౌంట్లలో తమ సంస్థ పేరు మీదున్న రూ.260 కోట్లను వెంటనే విడుదల చేసి స్వీడిష్ టెలికాం సంస్థ ఎరిక్‌సన్ ఖాతాలో జమ చేయాలని రిలయన్స్ గ్రూపు రుణదాతలను కోరింది. ఎరిక్‌సన్ గ్రూపుకు వెంటనే రూ. 550 కోట్లను చెల్లించాలని సుప్రీంకోర్టు బుధవారం అనిల్ అంబానీ గ్రూపును ఆదేశించిన విషయం విదితమే. నాలుగువారాల్లోగా రూ.453 కోట్లు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని కోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రుణదాతలు వెంటనే బ్యాంకు అకౌంట్లలో మూలుగుతున్న రూ.260 కోట్లను నేరుగా ఎరిక్‌సన్‌కు చెల్లించాలని అనిల్ అంబానీ గ్రూపు కోరింది. ఈ వివరాలను రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రకటనలో తెలిపింది. ఉన్నత న్యాయస్థానంలో ఇప్పడికే రూ.118 కోట్లను డిపాజిట్ చేశారు. మరో రూ.200 కోట్లను వీలైనంత త్వరలో సేకరిస్తామనే ధీమాను రిలయన్స్ కమ్యూనికేషన్స్ పేర్కొంది.