బిజినెస్

5జీ-రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: స్వీడన్‌కు చెందిన టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్సన్.. వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ కోసం 5జి-రెడీ ఎక్విప్‌మెంట్‌ను సరఫరా చేయడం ప్రారంభించినట్టు బుధవారం తెలిపింది. ఈ ఉపకరణాలను ప్రస్తుతం 4జి సేవలకు ఉపయోగించడం జరుగుతుందని, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) వ్యాపార అవసరాల కోసం వీటిని 5జి సేవలను అందించడం కోసం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని ఎరిక్సన్ వివరించింది. ‘వొడాఫోన్, ఐడియా సెల్యులార్ రెండింటికి మేము వ్యూహాత్మక భాగస్వాములంగా కొనసాగుతూ వస్తున్నాం. ఇప్పుడు వీఐఎల్‌తో ఈ ఒప్పందం ద్వారా మా భాగస్వామ్యంలో ఒక కొత్త దశలోకి ప్రవేశించాం. ఎరిక్సన్ రేడియో సిస్టమ్ పోర్ట్ఫోలియోలోని 5జి-రెడీ సొల్యూషన్స్ వీఐఎల్ ఎల్‌టీఈ (4జి) నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. దాని ఖాతాదారులకు హై క్వాలిటి మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేవడానికి తోడ్పడుతుంది’ అని ఎరిక్సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ బన్సల్ తెలిపారు. వీఐఎల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మొత్తం 22 టెలికం సర్కిళ్లలోని ఎనిమిది సర్కిళ్లలో ఈ పరికరాలను సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరినట్టు ఆయన వెల్లడించారు. వీఐఎల్ రానున్న 15 ఏళ్లలో నెట్‌వర్క్ విస్తరణ కోసం రూ. 20వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక రూపొందించుకుంది.