బిజినెస్

పావు శాతం వడ్డీరేట్ల కోతకు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఏప్రిల్ 5న ద్రవ్యసమీక్ష జరపనున్న క్రమంలో అప్పుడైనా, దానికి ముందైనా కీలక వడ్డీరేట్లను పావు శాతం చొప్పున తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ నివేదిక బుధవారం అభిప్రాయపడింది. ‘పాత జిడిపి గణన ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో 5.5 శాతం వృద్ధిరేటు కోసం దాదాపు 30 బిలియన్ డాలర్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి పంపించాల్సిన అవసరం ఆర్‌బిఐకి ఉంది.’ అని ఓ రిసెర్చ్ నోట్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ఈ క్రమంలోనే రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తగ్గించే వీలుందని అంచనా వేసింది. అంతేగాక నిధుల లభ్యతను పెంచడం కోసం బహిరంగ మార్కెట్ ద్వారా మరో 20,000 కోట్ల రూపాయలను ఆర్‌బిఐ ఈ నెలలో సమకూర్చవచ్చంది. గత నెల ఫిబ్రవరి 2న జరిపిన ద్రవ్యసమీక్షలో ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినది తెలిసిందే.