బిజినెస్

కొటక్ మహీంద్రకు బీమా వ్యాపార అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: ప్రైవేట్‌రంగ సంస్థ కొటక్ మహీంద్ర జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి బీమా వ్యాపారం చేయడానికి ఐఆర్‌డిఎఐ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన ద్వారా శుక్రవారం కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. దీంతో బీమా రంగ రెగ్యులేటర్ నుంచి తమకు రావాల్సిన అన్ని అనుమతులూ వచ్చాయంది. కాగా, కొటక్ మహీంద్ర గ్రూప్ 30వ వార్షికోత్సవం చేసుకుంటున్న తరుణంలో బీమా వ్యాపారానికి ఐఆర్‌డిఎఐ నుంచి అనుమతి రావడం ఆనందంగా ఉందని కొటక్ మహీంద్ర బ్యాంక్ అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ అధ్యక్షుడు గౌరంగ్ షా చెప్పారు.