బిజినెస్

ధరల అదుపునకు మావద్ద అద్భుత శక్తేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఆహారోత్పత్తుల ధరలు ఒక్కొక్కొటిగా ఆకాశానికేసి పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం అదుపునకు తమవద్ద అద్భుత శక్తి ఏమీ లేదని కేంద్ర ఆహార, వినియోగదారుల సంబంధాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ శుక్రవారం అన్నారు.
పప్పుధాన్యాలతోపాటు ఉల్లిగడ్డ, టమోటా ఇతరత్రా ఆహార పదార్థాల ధరలు ప్రస్తుతం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ తలకిందులైన పరిస్థితి. కిలో టమోటా 80-100 రూపాయల వరకు పలుకుతోంది. ఈ క్రమంలో ధరలను తగ్గించే మంత్ర దండమేమీ తమ దగ్గర లేదన్నవిధంగా పాశ్వాన్ విలేఖరుల వద్ద వ్యాఖ్యానించారు. మరోవైపు నిత్యావసరాల ధరలు ఇటీవలికాలంలో పెరుగుతూ పోతున్న క్రమంలో తమకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని, ధరల పెరుగుదలకు కారణమైన వారిని అరెస్టు చేసే అధికారం కూడా ఉండాలని వినియోగదారుల సంబంధాల శాఖ కోరుతున్నట్లు సదరు మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. పప్పుధాన్యాల ధరలు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. కిలో కందిపప్పు, మినపపప్పు ధరలు 200 రూపాయల స్థాయిని తాకాయి. అక్రమ పప్పు నిల్వలపై ఆయా రాష్ట్రాలు చేస్తున్న దాడుల్లో ఇప్పటిదాకా లక్ష టన్నులకుపైగా పప్పు నిల్వలు పట్టుబడ్డాయి. ధరల అదుపునకు వీటిలో 5వేల టన్నులకుపైగా పప్పుధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్‌లోకీ విడుదల చేశాయి.
మొత్తానికి పెరిగిన ధరలతో సామాన్య జనం హడలెత్తిపోతుంటే, సంబంధిత మంత్రి పైవిధంగా స్పందిస్తున్న తీరు ప్రాధాన్యతను సంతరించుకుంది.