జాతీయ వార్తలు

ఈశాన్య రాష్ట్రాల్లో బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విదేశాలలో శరణార్థులుగా ఉన్న ముస్లీమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్ధేశించిన పౌరసత్వ బిల్లుకు లోకసభ ఆమోదం తెలపటంతో ఈశాన్య రాష్ట్రాలలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. అసోం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలలో భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా అసోంలోని గువాహటి, దిబ్రుగఢ్ యూనివర్శిటీల పరీక్షలను వాయిదా వేశారు. పై రాష్ట్రాలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బంద్ పాటించాలని ఆందోళనకారులు నిర్ణయించారు. ఈమేరకు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. మణిపూర్‌ను ఇన్నర్‌లైన్ పర్మిట్‌లోకి తీసుకువస్తున్నట్లు అమిత్ షా ప్రకటించటంతో అక్కడ బంద్ పాటించటం లేదు.