ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణలో ఎత్తిపోతలు ఆపాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 19: గోదావరి నదికి శివార్లలో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల రైతుల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలను తక్షణం నిలుపుచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యచరణ సమితి డిమాండుచేసింది. ఎత్తిపోతల పథకాలు నిలువరించని పక్షంలో భవిష్యత్తులో రైతు కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని సమితి పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో సమితి అధికార ప్రతినిధి ఎంవి సూర్యనారాయణరాజు, మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి, కలిదిండి గోపాలకృష్ణంరాజు, నల్లమిల్లి వీరరాఘవరెడ్డి తదితరులు మాట్లాడారు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టాలను తట్టుకోలేక డెల్టా రైతాంగం వరి పంటకు దూరమవుతోందన్నారు. ప్రభుత్వం వరి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించకపోతే అన్నపూర్ణగా పిలిచే గోదావరి జిల్లాల్లో వరి పంట పండబోదన్నారు. ప్రాణహిత గోదావరిలో కలిసేచోట గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేస్తోందని, దీనివల్ల సెప్టెంబర్‌లో వరదల అనంతరం నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో గోదావరి జిల్లాల్లో వరి పండించడానికి నీరు రాదన్నారు. గోదావరిలో నీరులేక ఈ ఏడాది విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇబ్బంది ఎదురైందని, తాగునీటి సమస్య కూడా ఉత్పన్నమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని డిమాండు చేశారు. గోదావరి జిల్లాల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సోమవారం జిల్లాలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నివేదిస్తామని రైతు కార్యాచరణ సమితి నేతలు పేర్కొన్నారు.