బిజినెస్

ఐఫోన్ 6 కొనాలంటే.. 360 గంటలు కష్టపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశ రాజధాని నగరం ఢిల్లీలో సగటు ఉద్యోగి 360 గంటలు (15 రోజులు, రోజుకు సగటున 8 గంటలు పనిచేస్తే మాత్రం 45 రోజులు) పనిచేస్తే ఒక యాపిల్ ఐఫోన్ 6 (16 జిబి)ను కొనుగోలు చేసేంతా సంపాదించగలుగుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఇదే ఐఫోన్ 6 కోసం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ వాసులైతే కేవలం 20 గంటలు పనిచేస్తే సరిపోతుందని ఆ అధ్యయనం చెబుతోంది. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం యుబిఎస్ ‘ప్రైసెస్ అండ్ ఎర్నింగ్స్ 2015’ పేరిట ప్రపంచవ్యాప్తంగా 71 నగరాల్లో కొనుగోళ్ల శక్తిపై అధ్యయనం జరిపింది. దీని ప్రకారం ఢిల్లీలో ప్రజలు ఐఫోన్ 6ను సొంతం చేసుకోవాలంటే 360.3 గంటలు పనిచేయాల్సి వస్తోంది. అప్పుడే ఐఫోన్ 6 ధరకు సమానమైన డబ్బును సంపాదించగలం. ఈ విషయంలో ప్రపంచంలో ఢిల్లీ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ఉక్రెయిన్ రాజధాని కీవ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు ఐఫోన్ 6ను కొనాలంటే ఏకంగా 627.2 గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఇండోనేషియా రాజధాని జకార్తా, కెన్యా రాజధాని నైరోబిలు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. ఇక్కడ ఐఫోన్ 6 అంటే 468 గంటల శ్రమతో సమానం. ఈజిప్టు రాజధాని కైరో 353.4 గంటలతో నాలుగో స్థానంలో ఉండగా, ముంబయి 349.4 గంటలతో ఐదో స్థానంలో ఉంది. కాగా, జ్యూరిచ్‌తోపాటు న్యూయార్క్ వాసుల సంపాదన అధికంగానే ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇక్కడ 24 గంటల్లోపే ఐఫోన్ 6ను అందుకునేలా సంపాదించేయొచ్చు. ఐఫోన్ 6 గరిష్ఠ ధర రూ. 43,000. ఇకపోతే ఇదే తరహాలో మెక్‌డొనాల్డ్ బిగ్ మ్యాక్‌ను కొనాలంటే ఢిల్లీలో 50 నిమిషాలు, ముంబయిలో 40 నిమిషాలు శ్రమించాల్సి వస్తోంది. అప్పుడే దానికి సమానమైన సొమ్మును సంపాదించగలుగుతున్నారు ఇక్కడి ప్రజలు. అయితే హాంకాంగ్‌లో కేవలం 9 నిమిషాలు పనిచేస్తే చాలు బిగ్ మ్యాక్‌ను కొని తినేయొచ్చు. యుబిఎస్ వివరాల ప్రకారం జ్యూరిచ్, జెనీవా, లగ్జెంబర్గ్‌లలో సగటు ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్నాయి. నైరోబి, జకార్తా, కీవ్‌లతో పోల్చితే 19 రెట్లు అధికం. అలాగే భారత్‌లో ఉద్యోగుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని కూడా జాతా అధ్యయనంలో తేటతెల్లమైంది. అంతేగాక ఢిల్లీలో ఏడాదికి 2,214 గంటలు పని చేయాల్సి వస్తోందని, 26 రోజులు మాత్రమే సెలవులని, ముంబయిలోనైతే 2,277 గంటలు పనిచేస్తున్నారని, 21 రోజులు సెలవులుగా తీసుకుంటున్నారని కూడా యుబిఎస్ అధ్యయనంలో వెల్లడైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు వారం రోజుల్లో సగటున 40 గంటలు ఆఫీసుల్లోనే ఉంటున్నారు. ఈ విషయంలో హాంకాంగ్ 50 గంటలతో అన్ని దేశాల కంటే ముందుంది. హాంకాం గ్ వాసులు ఏడాదికి కేవలం 17 రోజులే సెలవులు తీసుకుంటున్నారు. మరోవైపు పారిస్‌లో వారానికి 35 గంటలు పనిచేస్తున్నారని యుబిఎస్ అధ్యయనం తెలిపింది.