బిజినెస్

రూ. 2 లక్షలు మించిన లావాదేవీలకు పాన్ తప్పనిసరి: అరుణ్ జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశీయంగా పుట్టుకొస్తున్న నల్లధనానికి చెక్ పెట్టడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జనవరి 1 నుంచి 50,000 రూపాయలకు మించి జరిగే హోటల్ బిల్లుల చెల్లింపులకు, విదేశీ ప్రయాణాల కోసం చేసే విమాన టిక్కెట్ల కొనుగోళ్లకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మంగళవారం ఇక్కడ కొత్త నిబంధనలను విడుదల చేశారు. అలాగే 2 లక్షల రూపాయలకుపైగా ఉండే అన్ని నగదు లావాదేవీలకూ పాన్ నెంబర్‌ను తప్పనిసరి చేస్తూ త్వరలో ఓ నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం 5 లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరిగా ఉంది. ‘నల్లధనాన్ని అడ్డుకోవడానికి సంబంధించి, మేము అతి త్వరలో ఓ నోటిఫికేషన్‌ను తెస్తున్నాం. 2 లక్షల రూపాయలకు మించి జరిపే నగదు లావాదేవీలకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) తప్పనిసరి చేస్తున్నాం. అని సప్లిమెంటరీ డిమాండ్స్ ఆన్ గ్రాంట్స్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో జైట్లీ స్పష్టం చేశారు. ఈ చర్య దేశీయంగ నల్లధనాన్ని నిర్మూలించగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో లక్ష రూపాయలకు మించి జరిగే కొనుగోలు లేదా అమ్మకాలకు పాన్ నెంబర్ తప్పనిసరి అంటూ ప్రతిపాదించినది తెలిసిందే. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు దీన్ని వ్యతిరేకించిన నేపథ్యంలో పాన్ నెంబర్ లావాదేవీల పరిమితిని 2 లక్షల రూపాయలకు మార్చుతున్నట్లు ఇప్పుడు జైట్లీ చెప్పారు. కాగా, క్యాష్ కార్డులు లేదా ప్రీపెయిడ్ కార్డుల కోసం 50,000 రూపాయలకు మించి చేసే చెల్లింపులు, అలాగే స్టాక్ మార్కెట్లలో లిస్టవ్వని సంస్థల్లో లక్ష రూపాయలకు మించి జరిపే షేర్ల కొనుగోళ్లకు కూడా పాన్ నెంబర్ తప్పనిసరి అవుతోంది. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలు మినహా బ్యాంకుల్లో తెరిచే అన్ని ఖాతాలకు పాన్ నెంబర్ తప్పనిసరి అని కూడా హస్ముఖ్ అధియా స్పష్టం చేశారు.