బిజినెస్

పెట్టుబడుల జోష్‌లో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను అందుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జరుపుతున్న ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు పెరుగుతాయన్న సంకేతాలున్నప్పటికీ వాటిని తోసిపుచ్చుతూ మంగళవారం మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేశారు.
ఈ క్రమంలోనే చమురు రంగ షేర్ల కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన మదుపరులు.. బ్యాంకింగ్ రంగ షేర్లను అమ్మేందుకు మొగ్గుచూపారు. అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 170.09 పాయింట్లు పుంజుకుని 25,320.44 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,700 మార్కును తాకుతూ 50.85 పాయింట్లు లాభపడి 7,700.90 వద్ద స్థిరపడింది.
ఆయా రంగాలవారీగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఇంధనం, ఎఫ్‌ఎమ్‌సిజి, రియల్టీ, ఇండస్ట్రియల్స్, చమురు, గ్యాస్, ఫైనాన్స్ రంగాల షేర్ల విలువ 1.50 శాతం నుంచి 0.45 శాతం పెరిగింది. అయితే టెలికాం, మెటల్, యుటిలిటి, టెక్నాలజీ రంగాల షేర్ల విలువ 0.22 శాతం నుంచి 0.06 శాతం తగ్గింది. ఇక అంతర్జాతీయంగా మంగళవారం ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. చైనా, హాంకాంగ్, జపాన్ సూచీలు 0.17 శాతం నుంచి 1.68 శాతం నష్టపోయాయ. అయతే సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు మాత్రం 0.02 శాతం నుంచి 0.41 శాతం పెరిగాయ. ఐరోపా మార్కెట్లు నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి.

ఏపిలో ఎస్‌బి ఎనర్జీ సోలార్ ప్రాజెక్టు

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీపిసి స్థాపించనున్న 350 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం బిడ్‌ను ఎస్‌బి ఎనర్జీ కైవసం చేసుకుంది. సాఫ్ట్‌బ్యాంకు, భారతి ఎంటర్‌ప్రైజెస్, ఫాక్స్‌కాన్ సంస్థలు ఎస్‌బి ఎనర్జీని సంయుకంగా ఏర్పాటు చేశాయి. 25 సంవత్సరాలపాటు రూ. 4.63 పైసలకు కిలోవాట్ చొప్పున సరఫరా చేసే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, వౌలిక సదుపాయాలు, డ్రైనేజీని ఏర్పాటు చేస్తుందని సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సిఒఒ నిఖేష్ అరోరా తెలిపారు. దేశంలో 20 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని తమ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
సమగ్ర వ్యవసాయ, ఉద్యానవన పార్కుకు
623 ఎకరాలు కేటాయింపు
మరోవైపు కర్నూలు జిల్లాలో సమగ్ర వ్యవసాయ, ఉద్యానవన పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 623 ఎకరాలను కేటాయించింది. ఈ విషయాన్ని ఏపిఐఐసి ఎండి తెలిపారు. జూపాడు బంగాల మండలం తంగడంచ గ్రామంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తారు.
జైన్ ఇరిగేషన్ పద్ధతుల్లో ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారు. 99 సంవత్సరాల లీజుపై ఈ భూములను కేటాయించారు. ఈ భూమి మార్కెట్ విలువ ఎకరం 4.5 లక్షలని, మొత్తం విలువ రూ. 28 కోట్లని ఏపిఐఐసి తెలిపింది. జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్‌కు ఈ భూమిని కేటాయించినట్లు ఏపిఐఐసి పేర్కొంది.

ఎల్‌ఐసి నొమురా వాటా హెచ్‌ఎఫ్‌ఎల్ చేతికి

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఎల్‌ఐసి నొమురా మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఎఎమ్‌సి)లో ఎల్‌ఐసి హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్) 19.3 శాతం వాటాను సొంతం చేసుకుంటోంది. 27 కోట్ల రూపాయలకు ఈ వాటాను ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్ కొనుగోలు చేస్తోంది. అలాగే ఎల్‌ఐసి నొమురా ఫండ్ ట్రస్టీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ ఇంతే మొత్తం వాటాను ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్ కొంటోంది. ఈ మేరకు మంగళవారం సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.

బేస్ రేటును తగ్గించిన డిసిబి బ్యాంక్

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: డిసిబి బ్యాంక్ బేస్ రేటు లేదా కనీస రుణ రేటును 0.15 శాతం తగ్గించింది. 10.70 శాతానికి తీసుకొచ్చింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బిపిఎల్‌ఆర్)ను కూడా 0.15 శాతం తగ్గించి 17.95 శాతానికి చేర్చింది. ఇంతకుముందు బేస్ రేటు 10.85 శాతంగా ఉండగా, బిపిఎల్‌ఆర్ 18.10 శాతంగా ఉండేది. తగ్గించిన వడ్డీరేట్ల వివరాలను దేశీయ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు డిసిబి బ్యాంక్ తెలియజేసింది. సెప్టెంబర్‌లో జరిపిన ద్రవ్యసమీక్షలో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్ల చొప్పున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తగ్గించినది తెలిసిందే. దీంతో ఇప్పటికే దాదాపు మెజారిటీ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయ.