బిజినెస్

ఫెడ్ రిజర్వ్ సమీక్ష కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష, ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సూచీలు ఒడిదుడుకులకు లోనుకావచ్చన్న అభిప్రాయాన్ని కనబరిచారు. ‘ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లను ద్రవ్యోల్బణం గణాంకాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం శాసిస్తాయి. ఒడిదుడుకుల మధ్య నష్టాలు తప్పవనిపిస్తోంది.’ అని ఎవిపి-మిడ్‌క్యాప్స్ రిసెర్చ్, మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు చెందిన రవి షెనాయ్ అన్నారు. ‘అమెరికా రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్షలో తీసుకునే నిర్ణయాలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరు, పార్లమెంట్‌లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అంశం ఈ వారం మార్కెట్ కదలికలను ప్రభావితం చేస్తాయి.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. కీలకమైన జిఎస్‌టి బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుందా? లేదా? అన్న సందిగ్ధత మధ్య మదుపరులు పెట్టుబడులకు దూరంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు నష్టాలకు గురవుతున్నది తెలిసిందే. సుధీర్ఘకాలం అనంతరం వడ్డీరేట్లను ఈసారి జరిపే ద్రవ్యసమీక్షలో పెంచుతామని ఫెడ్ రిజర్వ్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లన్ ముందుగానే సంకేతాలివ్వడంతో విదేశీ మదుపరులు కూడా పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారు. ఈ నెల ఆరంభం నుంచి దాదాపు 5,500 కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ పోర్ట్ఫోలిమో మదుపరులు (ఎఫ్‌పిఐ) దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి లాగేసుకున్నారు. కాగా, నవంబర్‌కుగాను టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం విడుదలవుతున్నాయి. మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష జరుగుతుండగా, సోమవారం మార్కెట్ ట్రేడింగ్‌పై గత వారం విడుదలైన పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 594 పాయింట్లు కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 171 పాయింట్లు పడిపోయింది. అంతకుముందు వారం కూడా సెనె్సక్స్ 490, నిఫ్టీ 160 పాయింట్లు దిగజారాయి.