బిజినెస్

ఆస్తుల్ని అమ్మేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మొండి బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుండటం, విజయ్ మాల్యా రుణాల ఎగవేత వ్యవహారం కోర్టులదాకా వెళ్ళడం వంటి పరిణామాల నేపథ్యంలో తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైతే ఆ రుణాల కోసం పూచీకత్తుగా పెట్టిన సంస్థ ప్రమోటర్ల ఆస్తులను వెంటనే అమ్మేయండంటూ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. రుణాలను చెల్లించనివారిపట్ల కఠినంగా వ్యవహరించాలంది. గత ఏడాది డిసెంబర్ ముగిసేనాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల విలువ 3.61 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో ప్రైవేట్‌రంగ బ్యాంకుల మొండి బకాయిల విలువ 39,859 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం.
ఏప్రిల్ 2న హాజరవ్వాలంటూ
మాల్యాకు ఈడీ తాజా సమన్లు
ముంబయి: లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం మరోసారి సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 2న ఇక్కడ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ నుంచి తీసుకున్న 900 కోట్ల రూపాయలకుపైగా రుణం వ్యవహారంలో నమోదైన కేసులో భాగంగా మనీలాండరింగ్ విచారణకు రావాలని మాల్యాకు ఈడీ తాజా సమన్లలో స్పష్టం చేసింది. కాగా, శుక్రవారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తనకు మరికొంత సమయం కావాలని, ఏప్రిల్‌లో రాగలనని ఈడీకి మాల్యా ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసినది తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్ 2న హాజరుకావాలని ఈడీ తాజా సమన్లను జారీ చేసింది. ఈ నెల 2నే మాల్యా దేశం విడిచి వెళ్లిపోయినది తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. ప్రస్తుతం విమానయాన సేవలకు దూరమవగా, ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేకపోయింది. ఉద్యోగులు సైతం తమ జీతాల కోసం ఆందోళనలు చేస్తుండగా, తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగానే చెల్లించడం లేదంటూ ఎస్‌బిఐసహా పలు బ్యాంకులు మాల్యాను విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించాయి. ఈ వ్యవహారం కోర్టులకు వెళ్లగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తోపాటు సిబిఐ, ఎస్‌ఎఫ్‌ఐఒ తదితర అన్ని దర్యాప్తు సంస్థలు విచారణలు జరుపుతున్నాయి. మరోవైపు విజయ్ మాల్యాపై రాహుల్ బజాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రుణాలు వసూలుకాని కేసుల్లో సరైన కారణాలుంటే రుణగ్రహీతలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అదే ఉద్దేశపూర్వకంగానే తీసుకున్న రుణాలను ఎగవేయాలని చూసేవారిపై అన్ని చర్యలను చేపట్టాలని, దీనివల్ల దేశానికి జరిగే నష్టమేమీ ఉండదని బజాజ్ అన్నారు. ఇక మాల్యా దేశం నుంచి ఎలా పారిపోయాడన్నదానిపై విచారణ జరుగుతోందని బిజెపి చీఫ్ అమిత్ షా తెలిపారు.