బిజినెస్

9 నెలల్లో లక్ష కోట్లు పెరిగాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 2015 మార్చి నాటికి 5.43 శాతంగా ఉంటే, డిసెంబర్ నాటికి 7.30 శాతానికి చేరాయన్నారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా జైట్లి తెలిపారు. మార్చిలో 2,67,065 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే, డిసెంబర్‌కు 3,61,731 లక్షల కోట్ల రూపాయలకు ఎగిశాయని పేర్కొన్నారు. అంటే ఈ తొమ్మిది నెలల్లో 94,666 కోట్ల రూపాయల మొండి బకాయిలు అధికమయ్యాయని వివరించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అంతకంతకూ పెరిగిపోతున్న మొండి బకాయిలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది తెలిసిందే.
మెరుగుపడుతున్న జిడిపి వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.6 శాతానికి పెరుగుతుందన్న విశ్వాసాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదైతే, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2013-14)లో 6.6 శాతానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధిరేటు మెరుగుపడుతోందని, 2015-16 జిడిపి వృద్ధి 7.6 శాతంగా ఉండొచ్చని జైట్లీ అంచనా వేశారు. ఈ మేరకు రాజ్యసభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా జైట్లీ తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక మాంద్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏమిటీ? అన్నదానిపై జైట్లీ పైవిధంగా స్పందించారు.
chitram...
రాజ్యసభలో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ