బిజినెస్

నకిలీ వీడియో ఆరోపణలపై దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌పై వచ్చిన నకిలీ వీడియోల వ్యవహారంపై దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నివేదిక వచ్చిన తరువాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వి హామీ ఇచ్చారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఇతర సభ్యులు ఈ అంశంపై జరిపిన చర్చకు ఆయన జవాబిచ్చారు. కన్నయ్యకుమార్‌పై దాడి చేస్తే బహుమతి ఇస్తాననే ప్రకటన చేసిన తమ పార్టీ కార్యకర్తపై తగిన చర్య తీసుకుంటున్నామన్నారు. కన్నయ్యకుమార్‌కు వస్తున్న బెదిరింపుల గురించి ప్రస్తావిస్తూ అతనికి పూర్తి రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. కొన్ని టెలివిజన్ చానళ్లు మొదట నాలుగు రోజులు ఒక వీడియో చూపించాయని, ఆ తరువాత నాలుగు రోజులు మరో వీడియోను చూపించాయని పేర్కొన్న ఆయన ఈ వీడియోల ప్రామాణికతపై దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ఈ దశలో రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ జోక్యం చేసుకుని నకిలీ వీడియోల అంశంపై దర్యాప్తు జరపాలని తన వంతుగా చెప్పారు. చంపేస్తామంటూ కన్నయ్యకుమార్‌కు వచ్చిన బెదిరింపులను తాము ఎంత మాత్రం సహించబోమని నఖ్వి ప్రకటించారు. మొదట ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మ అనే వ్యక్తి కన్నయ్యకుమార్‌ను హత్య చేస్తే 11 లక్షల బహుమతి ఇస్తాననే పోస్టర్లు ఢిల్లీలో పెట్టారని, బిజెపి యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కుల్దీప్ విష్ణోయ్ ఒక ప్రకటన చేస్తూ కన్నయ్యకుమార్ నాలుక కోసిన వారికి 5 లక్షల బహుమతి ఇస్తాననే ప్రకటన చేశారని సభ దృష్టికి తెచ్చారు. మొదట కన్నయ్యకుమార్‌పై నకిలీ వీడియో విడుదల చేశారని, ఆ తరువాత చంపివేస్తే వారికి బహుమతి ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు ఏమిటిది? అని ఆజాద్ ప్రశ్నించారు. కన్నయ్యకుమార్‌కు పూర్తి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య, తరువాత జెఎన్‌యులో ఈ సంఘటనలు, ఇప్పుడు అలహాబాద్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకురాలు రిచా సింగ్‌పై ఆరోపణలు చేస్తున్నారని గులాం నబీ ఆజాద్ అన్నారు. పలువురు ఇతర సభ్యులు కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేస్తు ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.