బిజినెస్

మహిళా సాధికారతకు కార్పొరేట్ ఇండియా దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనున్న క్రమంలో సోమవారం భారతీయ వ్యాపార, పారిశ్రామిక, బ్యాంకింగ్ సంస్థలు మహిళా సాధికారతకు దన్నుగా నిలిచాయి. పూర్తిగా మహిళా బ్యాంక్ శాఖ, ఇంటి వద్దనుంచే ఉద్యోగం చేసే అవకాశం, ఉద్యోగాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత వంటి హామీలను బ్యాంకులు ప్రకటించాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్.. ఏడాది వరకు ఇంటి వద్దనుంచే పనిచేసే సౌకర్యాన్ని మహిళలకు కల్పిస్తామని పేర్కొంది. చాలామంది మహిళలు ప్రసూతి, ఇతరత్రా కారణాలతో ఉద్యోగాలకు దూరమవుతున్నారని అలాంటి వారి కోసమే ఈ ఆలోచన అని బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్ చెప్పారు. ఐఐటి-్ఢల్లీ సహకారంతో వీరికి ఓ భద్రతా వ్యవస్థను కూడా కల్పిస్తున్నామన్నారు. అంతేగాక పనిపై ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు మూడేళ్లలోపు చిన్నారులుంటే వారినీ తమవెంట తీసుకెళ్ళేలా ప్రయాణ చార్జీలనూ ఇస్తామని కూడా తెలిపింది. మరో ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్ సైతం ప్రత్యేకంగా మహిళల ఆధ్వర్యంలో, వారి కోసం నడిచేలా ఓ శాఖను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇక ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. మహిళల కోసం 100 ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామని, ఇందులో అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు జరుపుతామని, అందుకనుగుణంగా వాటి నిరోధానికి కృషి చేస్తామని చెప్పింది. ఇక కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం కెనాన్ కూడా మహిళా ఉద్యోగులను పెంచుతామని, 2018 నాటికి మొత్తం సంస్థ ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగులు ఐదో వంతుండేలా చూస్తామంది. అలాగే బెంగళూరుకు చెందిన హెల్త్‌కేర్ స్టార్టప్ డాక్సాప్.. తమ యాప్ ద్వారా కేవలం రూ. 8కే మహిళలు ఏ వైద్య నిపుణుడినైనా సంప్రదించే అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.