బిజినెస్

ఆహారం, నిత్యావసర వస్తువుల రంగంలో ఎఫ్‌డిఐకి అనుమతివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లోని అత్యధిక వినియోగదారులు ఇప్పటికీ స్థానిక మార్కెట్ల నుంచే పండ్లు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నారని, దేశంలో ఫుడ్‌ప్రాసెసింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు ఆహారం, నిత్యావసర వస్తువులకు సంబంధించిన మల్టీ-బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మేధోమథన సంస్థ ఐసిఆర్‌ఐఇఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్) తన నివేదికలో పేర్కొంది. మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వలన స్థానిక దుకాణాలకు ఎటువంటి ముప్పు ఉండదని ఐసిఆర్‌ఐఇఆర్ ఈ నివేదికలో స్పష్టం చేసింది. మల్టీ-బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో 51 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని గత యుపిఎ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఈ విధాన నిర్ణయం నుంచి ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా వెనక్కి జరగలేదు. అయితే మల్టీ-బ్రాండ్ వ్యాపారంలో ఫుడ్‌ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై పునఃపరిశీలన జరపాలని సూచిస్తూ ఫుడ్‌ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ మూడు వారాల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఐసిఆర్‌ఐఇఆర్ ఈ నివేదికను వెలువరించింది. భారత వినియోగదారుల్లో ఇప్పటికీ చాలా మంది స్థానిక మార్కెట్ల నుంచి (53.3 శాతం), తోపుడు బండ్ల వ్యాపారుల నుంచే (18.8 శాతం) పండ్లు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నట్లు ఢిల్లీ, ఎన్‌సిఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం), ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాల్లో తాము నిర్వహించిన సర్వేలో వెల్లడయిందని, కనుక ఆహారం, నిత్యావసర వస్తువుల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం వలన స్థానిక వ్యాపారులకు ముప్పేమీ ఉండదని ఐసిఆర్‌ఐఇఆర్‌కి చెందిన అర్పితా ముఖర్జీ తెలిపారు.