బిజినెస్

గోల్డ్ బాండ్ పథకం అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: గోల్డ్ బాండ్ పథకంలో రిటైల్ మదుపరుల నుంచి అపూర్వ స్పందన కనిపించింది. 246 కోట్ల రూపాయల విలువైన 63,000 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. 917 కిలోల బంగారం కోసం బ్యాంకులు, తపాలా కార్యాలయాల ద్వారా మొత్తం 246.20 కోట్ల రూపాయలకు సమానమైన దాదాపు 63,000 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. కాగా, ఈ నెల 5-20 మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులు, తపాలా కార్యాలయాల ద్వారా తొలి విడత సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసినది తెలిసిందే. దీంతో 246 కోట్ల విలువైన 63,000 దరఖాస్తులు వచ్చినట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు పసిడి ద్రరుూకరణ పథకానికి (గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్) అంతంతమాత్రంగానే స్పందన వ్యక్తమవుతోంది. బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి దానిపై వడ్డీరూపంలో ఆదాయం పొందేలా ఈ పసిడి ద్రరుూకరణ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చినది తెలిసిందే.