బిజినెస్

పారిశ్రామిక నిపుణులు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఎమ్‌బిఎ విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) తెలంగాణ విభాగం చైర్‌పర్సన్ వనిత దాట్ల అన్నారు. తరగతి గదుల్లో నేర్చుకునే విద్యకు, ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకునే విద్యకు చాలా వ్యత్యాసం ఉంటుందని, ఆ వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించాలన్నారు. శుక్రవారం నాడిక్కడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి)లో నాయకత్వ లక్షణాలు అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు.
విశ్వవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ మైండ్‌సెట్ మార్చుకుని ఆధునాతన నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనువుగా నిపుణులను తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని, విద్యార్థులను పారిశ్రామిక రంగ నిపుణులతో కలిపేందుకు సిఐఐ నిర్వహించే సమావేశాలు మంచి వేదికలు అవుతాయని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.

మూడు ఎఫ్‌డిఐలకు ఎఫ్‌ఐపిబి ఆమోదం
న్యూఢిల్లీ, నవంబర్ 27: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) శుక్రవారం 160 కోట్ల రూపాయల విలువైన మూడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో సమావేశమై ఎఫ్‌ఐపిబి.. మొత్తం 13 ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను పరిశీలించగా, ఇందులో స్కెలెన్‌వర్క్స్ పీపుల్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పి, జివికె బయోసైనె్సస్, సింగపూర్‌కు చెందిన జిఎమ్‌ఎస్ ఫార్మా ఎఫ్‌డిఐలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

భారత అత్యంత సృజనాత్మక బ్రాండ్ టాటా గ్రూప్: టిఆర్‌ఎ

ముంబయి, నవంబర్ 27: ఉప్పు నుంచి ఉక్కు వరకు ఉత్పత్తి చేస్తున్న భారతీయ పారిశ్రామిక దిగ్గజ గ్రూపైన టాటా గ్రూప్.. భారత అత్యంత సృజనాత్మక బ్రాండ్‌గా నిలిచింది. ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ (టిఆర్‌ఎ) 16 నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. కాగా, ఈ జాబితాలో దక్షిణ కొరియాకు చెందిన సంస్థ సామ్‌సంగ్ రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎల్‌జి, సోని, హోండా, హెచ్‌పి, డెల్, నోకియా, మారుతి సుజుకి, బజాజ్ సంస్థలున్నట్లు టిఆర్‌ఎ సిఇఒ ఎన్ చంద్రవౌళి ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు.

కాల్గేట్ రెండో
మధ్యంతర డివిడెండ్
న్యూఢిల్లీ, నవంబర్ 27: ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థ కాల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ శుక్రవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేర్‌కు 3 రూపాయల డివిడెండ్‌ను ఇచ్చింది. దీని సంస్థ బోర్డు అంగీకరించిందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. కాగా, ఈ నెల ఆరంభంలో ఒకో షేర్‌కు 4 రూపాయల చొప్పున తొలి డివిడెండ్‌ను కాల్గేట్ ప్రకటించింది. కాల్గేట్ పామోలివ్ టూత్‌పేస్టులు, టూత్‌పౌడర్, టూట్‌బ్రష్‌లు, వౌత్‌వాష్‌లను ‘కాల్గేట్’ బ్రాండ్‌పై మార్కెట్‌లో అమ్ముతున్నది తెలిసిందే.