Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం కూడా బాక్సాఫీస్ భోరుమంది. సరైన కథనాల్లేని చిత్రాలు తెలుగు తెరపై దాడిచేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రవితేజ హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన ‘బెంగాల్ టైగర్’ ఈ వారం విడుదలైంది. జగపతిబాబు హీరోగా చాలాకాలం క్రితం తయారైన ‘హితుడు’ థియేటర్లకు వచ్చింది. శివ రెండో చిత్రంగా ‘అనగనగా ఓ చిత్రమ్’తోపాటుగా వంశీ పేరుపై ‘ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారంటీ’ అనే చిత్రాలతోపాటుగా అనువాద చిత్రం ‘కాకి’ విడుదలయ్యాయి. రవితేజ బెంగాల్‌టైగర్ హీరో స్టామినాతో కొద్దోగొప్పో థియేటర్ల వద్ద హంగామా చేస్తుంది. అయితే, సినిమాకు మాత్రం యావరేజ్ టాక్ వచ్చింది. హితుడు ఏ ప్రేక్షకుడికి హితం కావడంలేదు. అనగనగా ఓ చిత్రమ్, ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారంటీ చిత్రాలు సోదిలోలేవు. సినిమాలు కొద్దోగొప్పో బాగున్నా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో మూడోరోజునే కొన్నిచోట్ల బాక్సులు వెనక్కి వెళ్లిపోయాయి. ఇదీ పరిస్థితి.