రివ్యూ

తీరుమారని ఊరి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ రివ్యూ

** జై గాంగాజల్ (ఫర్వాలేదు)

తారాగణం:
ప్రియాంక చోప్రా, ప్రకాష్ ఝా, మానవ్ కౌర్, మురళీశర్మ, రాహుల్ భట్, నినద్ కామత్, వేగా తోమాటియా తదితరులు
సంగీతం: సలీమ్-సులేమాన్
నిర్మాత:
కెఎల్ దామోదర్‌ప్రసాద్
కథ, నిర్మాత, దర్శకత్వం:
ప్రకాష్ ఝా

భోపాల్‌లోని ఓ ప్రాంతం. అక్కడ పోలీస్ వ్యవస్థకంటే.. రాజకీయ చతురంగ దళాలదే రాజ్యం. ప్రజాస్వామ్యం కేవలం రాతలకే పరిమితం. నేతల కనుసన్నల్లోనే రక్తచరిత్ర నడుస్తూంటుంది- ఇంతలో.. ఓ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఊళ్లోకి వస్తాడు. ఇక అక్కడ్నుంచీ రాజకీయ నాయకుల ఎత్తులకు, పోలీస్ ఆఫీసర్ పైఎత్తులు వేస్తూ- పిల్లి ఎలుక ఆట ఆడేస్తుంటారు.
టూకీగా ఇదీ కథ అనుకొందాం. ఇదొక ఎవర్‌గ్రీన్ సబ్జెక్ట్. అందుకే-2003లో ‘గంగాజల్’ సినిమా తెగ ఆడేసి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఆనాటి చిత్రాల్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ -ఆ సినిమాకి సీక్వెల్ చేయాలన్న ప్రయత్నం ఆశించదగ్గదే అయినప్పటికీ.. వెరైటీ సబ్జెక్ట్స్‌ని కోరుకుంటున్న సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించటానికి ‘ప్రియాంక’ మినహా కథ ఆనాటి పంథానే అనుసరించటంతో ఊగిసలాట మొదలైంది.
సింపుల్‌గా కథ ఇదీ. బంకీపూర్ అనే ఊరు. ఊళ్లో రాజకీయులు చెప్పిందే వేదం. సామాన్య ప్రజానీకానికి ఎదిరించే ధైర్యం లేదు. లోకల్ గూండాలు జీపులపై ఊళ్లో తిరుగుతూ.. ప్రజల్ని భయపెట్టి డబ్బు దండుకోవటం.. అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరికేయటం. ఇదీ థియరీ. ఈ అరాచకమంతా బబ్లూ భయ్యా.. ఛోటా భాయ్ డబ్లూ భయ్యా కనుసన్నల్లో నడుస్తూంటుంది. వీళ్లకి పోలీసులంటే భయం లేదు. పోలీసులకు వీళ్లంటే వల్లమాలిన అభిమానం. వాళ్లు విసిరే చిల్లర పైసల కోసం వాళ్ల ఆరాటం. ఇలా నడుస్తూన్న చరిత్ర గతిని మార్చేందుకు ఆ ఊళ్లోకి ప్రవేశిస్తుంది ఎస్‌పి అభా మాధుర్ (ప్రియాంక చోప్రా). మాఫియాని తుదముట్టించి సామాన్యుడు ప్రశాంత జీవితం గడిపేట్టు చేయాలన్నదే ఆమె ఆశయం. ఈ ఆశయ సాధనకు ఆమె ఎదుర్కొన్న సవాళ్లు.. సమస్యలు ఎన్నో. రాజకీయానికీ.. పోలీస్ వ్యవస్థకీ మధ్య జరిగిన పోరాటంలో ‘అభా’ ఎటువంటి ధైర్యసాహసాలను ప్రదర్శించిందీ, రాజకీయ నాయకుల అరాచకాన్ని ఎలా మట్టుపెట్టిందన్నది క్లైమాక్స్.
టూకీగా చెప్పిన సినిమాలో గ్రామానికి సంబంధించిన అనేక అంశాలను పొందుపర్చారు. ఆయా సన్నివేశాలన్నీ ప్రతి మాస్ సినిమాలోనూ ఎదురయ్యేవే అయినప్పటికీ -కమర్షియల్ కోణంలో చూస్తే బానే ఉన్నట్టనిపిస్తుంది. అయితే -ప్రకాష్ ఝా చెప్పుకొన్నట్టు.. ఈ సినిమా కోసం అనే్నళ్లు ఎందుకు ఆగాల్సి వచ్చిందో అర్థంకాదు. ఇనే్నళ్ల తర్వాత సీక్వెల్ అనేప్పటికి.. కొత్తదనాన్ని ఆశించిన ప్రేక్షకులకు మరో ‘మాస్’ చిత్రం చూస్తున్నట్టనిపిస్తుంది తప్ప -వెరైటీ కానరాదు. కేవలం యాక్షన్ థ్రిల్లర్‌గానో... ప్రియాంక చోప్రా నటన గురించో అయితే బోలెడన్ని మార్కులు వేసేయ్యొచ్చు. మళ్లీ ఇక్కడా అవరోధమే. కథానాయిక ప్రియాంక చోప్రాని వదిలేసి.. భోలానాథ్ పాత్రపైనే కాన్సంట్రేట్ చేయటం.. అతడిపైనే అన్ని క్లోజప్స్.. లెక్కలేనన్ని ఫైట్స్ -పేజీల కొద్దీ మాటలు. దీంతో కథ పక్కదారి పట్టకపోయినా.. కథానాయికని వదిలేసి చిత్రం నేల విడిచి సాము చేసినట్టయింది. భోలానాథ్ పాత్ర ‘అభా’ని డామినేట్ చేసేదిగా ఉంది.
సీక్వెల్ అంటే -పాత కథకి ఎక్కడైతే ‘శుభం’ కార్డు పడిందో.. అక్కడ్నుంచీ కానీ.. లేదా ఆ కథలో ప్రశ్నలుగా మిగిలిన సన్నివేశాల్నిగానీ తీసుకొని.. కథకి కంటిన్యూ చెప్పటం. కానీ -‘జై గంగాజల్’ ‘గంగాజల్’ సీక్వెల్ అన్న ప్రస్తావన ఎక్కడా కనిపించదు.
ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో తనదైన స్టైల్‌ని కనపరచింది. డాన్-1, 2 చిత్రాల తర్వాత ‘ప్రియ’ సాహసోపేతమైన స్టంట్స్‌ని సైతం డూప్ లేకుండా చేసింది. బాడీలాంగ్వేజ్.. ఫైట్స్ తనకి తగ్గట్టు రూపొందించిన స్టంట్ మాస్టర్స్‌కి హేట్సాఫ్. తెర వెనుక రాజకీయ నాయకులను పూర్తిగా అధ్యయనం చేసినట్టుంది. ఒక్కో డైలాగ్ పవర్‌ఫుల్‌గా తెరమీదికి వచ్చింది. సినిమాకి మాటలు మరో ప్లస్ పాయింట్. మిగతా పాత్రధారులు తమ పరిధిలో మెప్పించారు. నేపథ్య సంగీతం ఓకే. సినిమాకి అన్నీ తానై.. ప్రకాష్ ఝా నిర్వహించిన ప్రతి శాఖ పనితీరు బాగుంది.

-ప్రనీల్