జాతీయ వార్తలు

అనర్హ ఎమ్మెల్యేలంతా ముంబయి బ్లూ బాయ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కర్ణాటకలో అసమ్మతి ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ మండిపడుతున్నారు. ముంబయి హోటళ్లలో విందులు, వినోదాలతో కాలం గడిపిన ఎమ్మెల్యేలంతా ‘ముంబయి బ్లూ బాయ్స్’ అని ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల పాటు పార్టీని బలోపేతం చేస్తే మూడు వారాల పాటు ముంబయి హోటళ్లలో ఈ అనర్హత ఎమ్మెల్యేలంతా విందులు, వినోదాల్లో మునిగితేలినవారిని ముంబయి బ్లూ బాయ్స్ అనక మరేమంటారని అన్నారు. కాగా జేడీఎస్‌ అనర్హ ఎమ్మెల్యే విశ్వనాథ్‌ ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పం దించారు. ఈడీ ఉచ్చులో పీకల్లోతు కూరుకున్న డీకే శివకుమార్‌ ఏ క్షణంలో జైలుకు వెళతారో తెలియని పరిస్థితి ఉందన్నారు. మేం బ్లూబాయ్స్‌ అయితే ఆయన రెడ్‌ బాయ్‌ కావచ్చునని విశ్వనాథ్‌ ఎద్దేవా చేశారు.