తెలంగాణ

బిజెపి అధ్యక్ష పదవికి పోటాపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశీలనలో ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, శేఖర్ పేర్లు
హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి గట్టిపోటీ ఎదరవుతోంది. దాదాపు డజను మంది అధ్యక్ష పదవిపై కన్ను వేసినా, పోటీ మాత్రం ఐదారుగురి మధ్యనే ఉంది. దాదాపు ఆరేళ్ల నుండి అధ్యక్షుడిగా ఉన్న జి కిషన్‌రెడ్డి చాలా కాలంగా తనను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించాలని కేంద్ర కమిటీని కోరుతూనే ఉన్నారు. రాష్ట్ర పునర్విభజన తదితర గడ్డు కాలంలో అకస్మాత్తుగా పార్టీ అధ్యక్షుడిని మార్చడం వల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని భావించిన కేంద్ర కమిటీ కిషన్‌రెడ్డినే కొనసాగించింది. సంస్థాగత ఎన్నికలు, పార్టీ సభ్యత్వం, కొత్త కమిటీల నియామకం చేపట్టాల్సిన తరుణంలో మరోమారు అధ్యక్షుడిని మార్చే అంశాన్ని కేంద్ర కమిటీ పక్కన పెట్టింది. 2009 నుండి అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి పక్కకు తప్పుకుంటే ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే చర్చ గత మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. అందులో డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు మొదట వినిపించగా, తర్వాతి స్థానంలో నల్లు ఇంద్రసేనారెడ్డి పేరు వినిపించింది. ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు పేరు వినిపించినా, ఆయన వయస్సు రీత్యా పార్టీ సిద్ధాంతకర్తగా సేవలను వినియోగించుకుంటున్నారు. గతంలో అధ్యక్ష పదవిని నిర్వహించిన అనుభవంతో రానున్న కాలంలో పార్టీని గాడిలో నడుపుతారని ఇంద్రసేనారెడ్డి పేరు వినిపించగా, ఇంత వరకూ ఒక్కసారి కూడా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించకపోవడం, విద్యాధికుడు కావడం వంటి అర్హతలతో లక్ష్మణ్ తెరమీదకు వచ్చారు. మరో పక్క కేంద్ర పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న మురళీధరరావు పేరు కూడా పరిశీలనకు వచ్చింది. అనేక రాష్ట్రాలకు ఇన్‌చార్జిగానూ , క్షేత్రస్థాయిలో పనిచేయడమేగాక, జాతీయ నేతలతో నేరుగా అనుబంధం ఉన్న మురళీధరరావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని అంగీకరిస్తారా అనేది పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయన వద్దనే పక్షంలో పార్టీకోసం పనిచేసిన కొత్త ముఖం కోసం అనే్వషించిన నాయత్వానికి తాజాగా శేఖర్‌జీ రూపంలో మరో నేత తెరమీదకు వచ్చారు. పార్టీ నేతలు అంతా శేఖర్‌జీ అని పిలుచుకునే పేరాల శేఖరరావు ఎబివిపి పూర్తికాల కార్యకర్తగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా, ఈశాన్య రాష్ట్రాల జోనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. 40 ఏళ్లు స్వయంసేవక్‌గా, 30 ఏళ్లు ప్రచారక్‌గా పనిచేసిన శేఖరరావు గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలతో జాతీయ స్థాయిలో సమన్వయం సాధించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, కార్యదర్శిగా, ఈస్టు కోస్టు జోనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. శేఖరరావుతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న ఎన్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, హిందూ ప్రతినిధిగా ఇటీవల ఎదిగిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ల పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఎక్కువ సమయం పార్టీకి వెచ్చించడం, అందరినీ కలుపుకుంటూ వెళ్లడం, పార్టీ కార్యకర్తలలో జాతీయ పార్టీ విధానాలు, పంథా, పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చైతన్యం కలిగించడం వంటి ప్రాథమిక లక్షణాలే ప్రధాన అర్హతగా అధ్యక్ష ఎంపిక జరుగుతుందని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న బండారు దత్తాత్రేయ పేరు గతంలో ప్రస్తావనకు వచ్చినా, నేడు కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు కనుక ఆయనకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించే ప్రసక్తే లేదని చెబుతున్నారు.