ఆంధ్రప్రదేశ్‌

దేశ భవిష్యత్ కాంక్షించేవారికి బీజేపీ అండ:రాంమాధవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: దేశ భవిష్యత్ కాంక్షించేవాళ్లు బీజేపీలో చేరతారని, గత 70 రోజుల పాలనలో మోదీ చూపించిన సత్తా దీనికి కారణమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. తిరుపతిలో టీడీపీ సీనియర్ నేత సైకం జనార్థన్ రెడ్డి బీజేపీలో చేరారు. రాంమాధవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సైకం జనార్థన్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ ఆంధ్రా ప్రజలు వాస్తవాలు తెలుసుకున్న రోజున ప్రజలు మోదీతోనే ఉంటారని అన్నారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటివి మోదీ విజన్‌కు నిదర్శనమని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీలో చేరికలు ప్రధాని మోదీ పాలనాదక్షతకు నిదర్శనమని అన్నారు.