రాష్ట్రీయం

బిల్ట్ యాజమాన్యంతో 29న ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: వరంగల్ జిల్లా కమలాపూర్‌లోని ఎపి రేయాన్స్ తిరిగి తెరుచుకోనుంది. 2014లో మూత పడడంతో కార్మికులు ఇబ్బందుల పాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమను తిరిగి పునరుద్ధరించేందుకు శ్రద్ధ చూపడంతో కార్మికుల్లో ఆశలు చిగురించాయి. బిల్ట్ పేపర్ మిల్లుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎంపి సీతారాంనాయక్ సమావేశంలో పాల్గొన్నారు. బిల్ట్ యాజమాన్యంతో ప్రభుత్వం ఈనెల 29న ఒప్పందం కుదుర్చుకుంటుంది. అనంతరం ఈనెల31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మరోసారి సమావేశం అవుతారు. బిల్ట్ పరిశ్రమకు ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. ఏటా 21 కోట్లరూపాయలు కేటాయించనున్నారు.

వరల్డ్ యోగ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్
పొందిన విద్యార్థికి సిఎం అభినందన
హైదరాబాద్, డిసెంబర్ 21: మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన వరల్డ్ యోగ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీలలో రజిత పతకాన్ని గెలుచుకున్న మహబూబ్‌నగర్ జిల్లా మదనపూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి సుందర్‌రాజును ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో అభినందించారు. వ్యవసాయ కూలి కుమారుడైన సుందర్‌రాజు వరల్డ్ యోగ ఛాంపియన్ షిప్ పోటీలలో రజిత పతకాన్ని గెలుచుకోవడం రాష్ట్రానికి, మహబూబ్‌నగర్ జిల్లాకు గర్వకారణమని ముఖ్యమంత్రి కొనియాడారు.