జాతీయ వార్తలు

రేపు రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోకసభలో సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ నిన్న అర్థరాత్రి పౌరసత్వ బిల్లును ఆమోదించుకోగలిగింది. ఇందుకు కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం మద్దతు పలికాయి. రేపు ఈ పౌరసత్వ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. కాని ఎగువ సభలో ఈ బిల్లు గట్టెక్కటం అంత సులువు కాదు. కాని లోకసభలో వలే రాజ్యసభలో కూడా ప్రాంతీయ పార్టీల సహకారంతో బిల్లును ఆమోదింపజేసుకునేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. దేశ ప్రజల మంచి కోసం రూపొందించిన ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. కొన్ని పార్టీల ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మద్దతు పలకలేదని విమర్శించారు. దేశం కోసం చేసే ప్రతి బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని విమర్శించారు. పొరుగు దేశాల్లో మత పరమైన పీఢనకు గురైన శరణార్థులకు మన దేశానికి వచ్చే ముస్లీమేతరులకు భారత పౌరసత్వం కల్పించే దిశగా ఈ బిల్లు రూపొందించారు. కాగా ఈ బిల్లును 2016లో పార్లమెంటు ముందుకు తీసుకువచ్చారు. లోకసభలో ఆమోదం పొందగా..రాజ్యసభ ముందుకు వచ్చేసరికి లోకసభ రద్దయింది. మళ్లీ ఈ బిల్లును ఇపుడు తీసుకువస్తున్నారు.