బిజినెస్

‘కింగ్‌ఫిషర్ హౌస్’ వేలం అట్టర్ ఫ్లాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిడ్డర్లు లేక గంటకే ముగింపు భారీ ధర, వ్యాజ్యాల భయమే కారణం
బ్యాంకుల కన్సార్టియంకు ఎదురుదెబ్బ త్వరలో సమీక్షా సమావేశం
ముంబయి, మార్చి 17: బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వకంగా వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థకు గతంలో ప్రధాన కార్యాలయంగా వ్యవహరించిన ‘కింగ్‌ఫిషర్ హౌస్’కు గురువారం నిర్వహించిన వేలం అట్టర్ ఫ్లాప్ అయింది. దీని కనీస ధరను భారీ మొత్తంలో రూ.150 కోట్లుగా నిర్ణయించడంతో పాటు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయాందోళనలతో ఈ వేలంలో పాల్గొనేందుకు ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదు. దీంతో మాల్యా నుంచి కనీసం కొంత మేరకైనా రుణాలను తిరిగి వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బ్యాంకర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబయిలోని దేశీయ విమానాశ్రయానికి సమీపాన విలే పార్లేలో 17 వైలకుపైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి ఉన్న ఈ భవన వేలాన్ని గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించారు. అయితే ఈ వేలం విజయవంతం కాకపోవడంతో కేవలం గంట సేపటికే ముగిసింది. ఈ వేలంలో పాల్గొనేందుకు ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదని, రిజర్వు ధరను అధికంగా నిర్ణయించడమే ఇందుకు కారణమై ఉంటుందని భావిస్తున్నానని వేలంతో ప్రమేయం ఉన్న ఒక అధికారి తెలిపారు. ప్రభుత్వ రంగంలో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వాన కన్సార్టియంగా ఏర్పడిన బ్యాంకుల తరఫున ‘ఎస్‌బిఐ క్యాప్స్’ ఈ వేలాన్ని ఏర్పాటుచేసి కింగ్‌ఫిషర్ హోమ్ కనీస ధరను రూ.150 కోట్లుగా నిర్ణయించిందని, అయితే దీనిని చాలా అధిక ధరగా బిడ్డర్లు భావించి ఉండవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ వేలం విజయవంతం కాకపోవడంపై బ్యాంకుల కన్సార్టియం త్వరలో సమీక్షా సమావేశం జరపనుందని, కింగ్‌ఫిషర్ హోమ్ కనీస ధర గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.