మెయిన్ ఫీచర్

నడిపించేవాడే నాన్న... నేడు ఫాదర్స్ డే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

......................
అమ్మ పరిచయం చేసిన మొదటి వ్యక్తి నాన్న. నాన్నంటే
నడిపించే వాహనం. నాన్నంటే నడిచొచ్చే దైవం.
బిడ్డ పుట్టుకకు హేతువై విద్యాబుద్ధులు నేర్పటంలో గురువై, వారి అభివృద్ధికోసం అహర్నిశలూ శ్రమించే సైనికుడే నాన్న. తనకంటే తన బిడ్డను గొప్పవాడిగా తీర్చిదిద్దేందుకు తన భుజాలను ఆసరాగా యిచ్చి ఎత్తుకి ఎదగాలని కోరుకునే
గొప్ప వ్యక్తిత్వం గలవాడు నాన్న.
నాన్నంటే భరోసా! నాన్నంటే భద్రత! నాన్నంటే బాధ్యత!
..............................
బాణంలా బిడ్డల్ని మలచి లక్ష్యంవైపు దూసుకెళ్ళేందుకు తానే విల్లులా ఉపయోగపడతాడు నాన్న. త్యాగానికతడు మారుపేరు. కష్టాలు కడుపులోనే దాచుకుని బిడ్డలకు మాత్రం సంతోషాన్ని పంచిపెడతాడు. రెప్పదాటి తన కన్నీరు బయటికి రానీయడు. నమ్మకానికి నిలువెత్తు చిరునామా!
............................
బిడ్డలను మంచి పౌరులుగా మలచటం నాన్న లక్ష్యం. లక్ష్యసాధనలో అతడు తన జీవితానే్న సమిధగా చేస్తాడు. తన చిన్నారుల చిటికెన వ్రేలందుకుని నడిపిస్తూ.. తమ కాళ్ళపై తాము నిలబడేదాకా వారి వెన్నంటి నీడై వుంటాడు.
అనుక్షణం తన బిడ్డల సుఖ సంతోషాలకోసం కరిగే క్రొవ్వొత్తి అతడు!
వారి జీవితాల్లో వెలుగులు నింపే సూరీడు!
తన చిన్నారుల మెదళ్ళలో మొలిచిన అజ్ఞానం కలుపును ఏరి విజ్ఞాన విత్తనాలు జల్లే కృషీవలుడు!
చెమటను చిందించి బిడ్డల జీవన సౌధాన్ని నిర్మించే శ్రామికుడు!
సమస్యలతో వాడు సతమతమయ్యేవేళ- తన మాటల ఔషధంతో నయం చేయగల వైద్యుడు!
చెడ్డదారిలో నడిచే తనయులను సక్రమ మార్గాన నడిపించే లాయరవుతాడు.
తన చేతులతో బిడ్డ చేతిని అందుకుని సక్రమ జీవన మార్గాన్ని చూపే మార్గదర్శకుడు నాన్న! తన బిడ్డలకు లభించే చిన్నపాటి గెలుపైనా సరే, అదే అతనికి కొండంత సంబరం. నలుగురితో చెప్పుకుని మురిసిపోతాడు. వెన్ను తట్టి వారిని మున్ముందుకు ప్రోత్సహిస్తాడు.
ఓటమి పొందిన తనయుణ్ణి భుజం తట్టి, ఓటమే నీ మొదటి గెలుపని చెప్పే మార్గనిర్దేశకుడవుతాడు. దిగులు మబ్బుక్రమ్మిన సూరీడు కాదని కర్తవ్యాన్ని బోధించే శ్రీకృష్ణుడవుతాడు. జీవన పోరాటానికి మళ్లీ సన్నద్ధుణ్ణి చేస్తాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే, తన బిడ్డల్ని గమ్యాన్ని చేర్చేందుకు మున్ముందుకు సాగే అలుపెరుగని రథసారథి అతడు.
తన కళ్ళముందే తన బిడ్డను వుంచాలనుకుంటుంది తల్లి ప్రేమ. అయితే తండ్రి తాబేలు వంటివాడు. ఆ ఒడ్డునుండే మరో ఒడ్డునున్న తన బిడ్డలవైపు చూపు సారిస్తుంది తాబేలు. చూపులతోనే దూరంగానున్న తన బిడ్డలకు ఎదగడం నేర్పిస్తుంది. తండ్రీ అలాంటివాడే. బిడ్డను ఉన్నతుడిగా మలిచే క్రమంలో విద్యార్థి దిశనుంచే వారిని మేలైన విద్యా సంస్థల్లో చేర్పించి వారికి చక్కటి భవితను అందించడంకోసం, బిడ్డ తనకి దూరంగా వున్నాడన్న బాధను గరళంగా మింగే శివుడు నాన్న. పుట్టుకకు కారకుడు నాన్న. నానే్న బ్రహ్మ. ఆలనా పాలనా చూసేవాడు నాన్న. అందుకే నాన్న త్రిమూర్తి స్వరూపుడు.
బిడ్డ ఒక్కో మెట్టు ఎక్కి ఉన్నత స్థానం చేరేందుకు తను నిచ్చెనై నిలబడతాడు. అతని పెంపకంలో కఠినత్వం కనపడినా, అది బిడ్డల రేపటి భవితకోసం ఆయన పడే తపన. నాన్న మనసు వెన్న. అది బిడ్డలమీద ప్రేమతో ఎల్లపుడూ కరుగుతూనే వుంటుంది.
కష్టకాలంలో కంటిపాపై, అవసర సమయాన ఆపన్నహస్తమై, అనుక్షణం తను వాళ్ళ క్షేమానికై ఆరాటపడతాడు. అల్లారుముద్దుగా పెంచి ఆటపాటలతో పాటుగా, ఆత్మస్థైర్యమూ నేర్పిస్తాడు. బడిలో గురువులు పాఠాలు నేర్పిస్తే బతుకు పోరాటం నేర్పించే గురువు. బిడ్డల లోపాలు సరిచేసి వారి భవితకు చక్కటి పునాది వేస్తాడు. తాను వెనకుండి, తన బిడ్డల్ని విజయపథంవైపు నడిపిస్తాడు. పడినవేళ తన చేయందించి, భుజం తట్టి ప్రోత్సహించి మళ్లీ లక్ష్యంవైపు బిడ్డల ప్రయాణం కొనసాగేలా చూస్తాడు.
ఉద్యోగం రాలేదని నలుగురిలో నవ్వులపాలయ్యేమనీ, చెయ్యని నేరానికి శిక్ష పడిందనీ, అనుకోని విపత్తు జరిగిందనీ, కారణమేదైనా కానీ బిడ్డ కన్నీరు చూసి చలించిపోతాడు. నిరాశా సుడిగుండంలో కొట్టుకుపోతున్న బిడ్డని ఆశ అనే గడ్డిపోచతో ఒడ్డుకు లాగేస్తాడు. ఆత్మస్థయిర్యంతో అన్నం తినిపిస్తాడు, శిశిరమైన బిడ్డ బ్రతుకుని మళ్లీ వసంతంగా చిగురింపజేస్తాడు.
వందమంది ఆచార్యులకన్నా గొప్పవాడు తండ్రి. కనపడే దైవం నాన్న. ఏ వరాలడిగినా ఏదీ ఆశించకుండానే ఇస్తాడు. నడిచొచ్చే స్వర్గం నాన్న. కావాల్సినవి అందించే కామధేనువు నాన్న. అందుకే పితృదేవోభవ అని మన వాఙ్మయం చెబుతుంది. నాన్నని గౌరవించడం క నీస కర్తవ్యం. తండ్రి ఆనతికి కట్టుబడి అడవులకేగిన శ్రీరామచంద్రుడు వేనోళ్ల కీర్తింపబడ్డాడు.
‘పితా ఉచ్ఛతపశ్చ భాత్’ అనగా ఆకాశం కంటే తండ్రి ఉన్నతమైన వాడని దీని భావం.
సర్వ దేవ మయః పితా! అనగా సమస్త దేవతల మహత్మ్యం తండ్రిలోనే ఉంది.

Chellapilla syamala