Others

కొండ దేవుడికి కొండంత బంగారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం బంగారాన్ని తులం, గ్రాము, సవర- కాసు- అంటూ - అటువంటి ప్రమాణాలతోనే చెప్పుకుంటాం. గానీ ఏడుకొండల వడ్డీకాసుల సామి వేంకటేశ్వరునికి కొండంత బంగారం వుంది- దాన్ని టన్నుల్లోనే చెప్పాలి.
వ్యాపారాలన్నింటికన్నా వడ్డీ వ్యాపారమే లాభదాయకం కదా! బాలాజీస్వామికి ఏటా ఓ ‘టన్ను’బంగారం- భక్తుల దగ్గరనుంచి కానుకల రూపంలో వస్తుంది. ఇదంతా నగల రూపంలో కదా? వస్తుంది! దీన్ని ముంబాయ్‌లోని ప్రభుత్వ ‘మింట్’కి పంపించి- పాళా బంగారం కడ్డీలుగా, దిమ్మలుగా మారుస్తారు. వెంకన్నగారి ‘‘గోల్డ్‌ని’’ రుూ ఏడాది కొత్తగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో ‘‘మంచి వడ్డీ యిస్తాం’’- అన్నారు గనుక, ఒక టన్ను, మూడువందల పదకొండు కేజిలు డిపాజిట్ చేస్తున్నారు- ఎస్.బి.ఐ.లో వున్న బంగారంతో కలిపి- స్వామివారి బంగారం ఐదున్నర టన్నులుంది (బ్యాంకులలోనే).
ఐతే, బాలాజీకన్నా- కేరళలోని పద్మనాభాజీస్వామికి సువర్ణ సంపద చాలా ఎక్కువ. పద్మనాభుని బంగారం 1,300 టన్నుల దాకా వుంది. నెంబర్ ‘టు’ ర్యాంకు బాలాజీదే. 300 టన్నుల బంగారం వున్న ఆసామీ రుూయన. గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి రెండు టన్నుల బంగారం వుంది. సాయిబాబాకి 360 కిలోలుంటే ముంబాయి సిద్ధి వినాయకుడికి 160 కేజీల బంగారముందిట.
మన దేశంలో సంపన్న దేవుళ్లందరి బంగారు సంపద కలిపి చూస్తే ఉజ్జాయింపుగా నాలుగువేల టన్నులుంటుంది! వెంకన్నగారి సాలీనా ఆదాయం 2600 కోట్ల రూపాయలు. ఇందులో ‘‘గోవిందా! గోవిందా!’’అంటూ దీక్షబూని వచ్చిన భక్తులు యిచ్చే మొత్తం వెయ్యి కోట్ల రూపాయలుంటుంది. వడ్డికాసుల వాడికి వడ్డీల ద్వారా మరో 800 కోట్ల రూపాయలు ముడుతుంది. దర్శనం, టిక్కెట్లు, ప్రసాదం ద్వారా మరో 600 కోట్ల రూపాయల దాకా ఆదాయం రాగా- జీతనాతాలకి 500 కోట్ల రూపాయలు దాకా ఖర్చుఅవుతుంది. వజ్ర వైఢూర్యాది రత్నరాసులున్నాయి. వేరే ఆస్తులు, సొమ్ములూ వగైరా- అమ్మో! చాలానే వున్నాయ్. ‘‘అయినా ఒక్క పైసా వడ్డీ వొగ్గడు స్వామి’’- అన్నాడో భక్తుడు గుండు తడుముకుంటూ!-
‘‘చేతులు తుడుచుకోండి:’’ ముంబయ్ హోటల్స్!
మహారాష్టల్రో అనావృష్టి పరిస్థితి ముంబయ్ హోటల్స్ ముఖ్యంగా ‘స్టార్ రెస్టారెంట్లు’ మీద పడింది. ఖాతాదారులకు సగం నింపిన మంచినీళ్ల గ్లాసులనే అందిస్తున్నారు వాళ్లు. వాష్ బేసిన్‌లలో చేతులు కడుగరాదు. కాగితం చేరుమాళ్లు యిస్తున్నారు. వాటితోనే చేతులు, మూతి తుడుచుకోవాలి.
మాతుంగాలోని సుప్రసిద్ధ మైసూర్ కేఫ్ ఖాతాదారులకు - ‘‘ఏదయినా ‘మారు’అడగండి. గానీ మంచినీళ్లు మాత్రం అడగకండి’’- అన్న ధోరణిలో బోర్డులు పెట్టింది. ‘‘టిఫిన్ ప్రియులు- ఒకవేళ గ్లాసులలో మంచినీళ్లు సగం సగం త్రాగి, మిగతావి వదిలిపెడితే- ఆ ‘మిగులు జలాలను’ బకెట్‌లలో భద్రపరిచి- వాటిని యితర వాడకాలకీ, వాహనాలను కడగటానికీ ఉపయోగిస్తాం’’-అంటున్నారు. ‘‘ఒకవేళ, మాకే తిరిగి యివ్వరు కదా-? తాగటానికి’’- అంటూ అనుమానం వ్యక్తంచేసిందో ఖాతాదారు.
బాంద్రాలోని కొన్ని హోటల్స్‌లో అడిగితే తప్ప మంచినీళ్ల గ్లాసులు నింపరు. పది వేల మంది సభ్యులున్న పశ్చిమ ఇండియా హోటళ్ల సంఘం అన్ని హోటల్స్‌కీ నీటి పొదుపు సూచనలను పంపించింది. చర్చిగేట్ ప్రాంతంలో వున్న మరో పేరున్న హోటల్ ‘ప్లంబర్’ని పిలిచి, పంపు గొట్టాల ‘‘పీక’’లు బిగింపించింది. నీరు సన్నగా మాత్రం వస్తుంది. చౌపాలీలో వున్న మరో సంద్ర తీర శాకాహార రెస్టారెంటు దుబాయ్ నుంచి- బోలెడు ఖర్చుపెట్టి గినె్నలు కడిగే యంత్రం తెప్పించుకుంది. ఈ యంత్రం నాలుగు గినె్నలకు చాలిన నీళ్లతో- నలభై పాత్రలు కడుగుతుందిట!
ఇలా వుండగా పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్లు- కార్లు, మోటారు సైకిళ్లతో కిటకిటలాడే ‘‘రాత్రి ఫలహారశాల’’లు మూడోవంతు నీటి వాడకం తగ్గించేశాయి. వీళ్లు ‘‘పండ్ల రసాలకి’’కూడా గ్లాసులు చిన్న సైజువి తెప్పించారు. ‘సెల్ఫ్ సర్వీసు’- నీటి గ్లాసులకి లేదు. వాళ్లే యిస్తారు మంచినీళ్లు మాత్రం. టిఫిన్‌లే మనం తెచ్చుకోవాలి- ఇలా ముంబాయి ‘‘చుక్క నీటి’’కి చుక్కలు లెక్కెడుతోంది! మన హైదరాబాద్, వైజాగ్‌లు కూడా- దీన్నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లలో పని అమ్మాయిలు నిరంతర ‘‘ప్రవాహధారలున్న పంపులుంటే’’నే గినె్నలు కడుగుతారు. ‘‘పంపు కట్టేయమంటే- పని వదిలి పారిపోతామంటున్నారు. గృహిణులు వాళ్లకు నచ్చచెప్పి, వానలు పడేదాకా బకెట్‌లో నీళ్లు నింపుకుని గినె్నలు కడగాలని ధైర్యంగా చెప్పక తప్పదు మరి-
నితీష్ ధర్మమా అని మళ్లీ పెళ్లి!
బీహార్‌లో రొహటక్ జిల్లాలో రుూనెల 18న పదహారేళ్ల అమ్మాయి ‘గుడ్డీ’- ‘‘మా అమ్మానాన్నల మళ్లీ పెళ్లి. రారండోయ్!’’అంటూ శుభలేఖలు పంచింది. ‘‘ముఖ్యమంత్రిగారి ధర్మమా అని, ఆయన చలవే యిదంతా’’అన్నది. సాధార్నంగా ఆడపిల్లల పెళ్లి శుభలేఖలు వాళ్ల అమ్మానాన్నలు పంచుతారు. కాని అందుకు భిన్నంగా జరిగింది ఇది. యాభై సంవత్సరాల వైజయంతీదేవి, యాభై ఎనిమిది ఏండ్ల గోవింద్‌సింగ్‌ల పెళ్లి మరోసారి వాళ్ల కూతురు సాయంతో గొప్పగా జరిగింది.
అసలు సంగతి గోవింద్‌సింగ్ పరమ త్రాగుబోతు. తాగి వచ్చి రోజూ భార్యని చావ చంపి చెవులు మూస్తూ వుండేవాడు. ఈ బాధలు పడలేక పదహారు సంవత్సరాలయింది ఆమె మొగుణ్ణి వదిలేసింది.
ఇటీవల గోవింద్‌సింగ్- సంపూర్ణ మద్యనిషేధంతో బుద్ధిమంతుడై త్రాగుడుకి గుడ్‌బై చెప్పేశాడు.(ట)
‘‘గుడ్డీ’’కి నాన్నంటే అంత యిష్టం. ‘‘నాన్న యిక ఛస్తే త్రాగడమ్మా’’ - అంటూ ఆ యిద్దర్నీ కలిపింది. పదహారు ఏళ్లయింది, ఆ యిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నితీష్‌గారి ‘మద్యం ప్రొహిబిషన్ విడిపోయిన దంపతుల్ని రుూ విధంగా కలిపింది. ‘‘గుడ్డీ’’ అమ్మానాన్నల పెళ్లి వైభవంగా చేసింది. కాని మందు పార్టీలు లేవు. విందు పార్టీలే అన్నీ!-
కొసరు ముచ్చట!
ఆంధ్రాలో త్రాగడానికి నీటి చుక్కలు లేక అల్లాడుతూ వుంటే నాలుగు గజరాణులు (ఆడ ఏనుగులు) ఒరిస్సా అడవులలోనుంచి- శ్రీకాకుళం గ్రామాల దాకా దాహర్తితో, నీళ్లు వెతుక్కుంటూ జొరబడి - రెండు మండలాల్లో వరి పొలాల్ని ధ్వంసం చేశాయి. కొత్తూరు మండలం ‘చింతమానుగూడ’ గ్రామంలో యివి బీభత్సం సృష్టించాయి. నిజానికి రుూ ఏనుగుల బెడద భరించలేక రుూ ప్రాంతం రైతులు అరటి తోటలు వేయడం లేదు. చెరుకు తోటలు పెంచడం మానేశారు. రాత్రుళ్లు నిద్రపోవడం లేదు. నిజానికి రుూ నాలుగు ఏనుగులు ఒరిస్సానుంచి ఏనాడో వలస వచ్చేయి అంటున్నారు. ‘‘పొమ్మంటే’’ పోవు పైగా కోపంతో పొలాలు మట్టేస్తాయి. కొంపలు కూల్చేస్తాయి. ఏనుగు బలం- ఏనుగు దాహం రెండూ ఎక్కువే!-

-వీరాజీ