మెయిన్ ఫీచర్

నాలుగు దశాబ్దాల నిరీక్షణ.. నిజమైన వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంప్యూటర్ ఆన్‌చేసి మెయిల్స్ చెక్‌చేసుకుంటున్న ఎలిజబెత్‌కు ఓ ఈ-మెయిల్ సారాంశం ఆనందడోలికల్లో ముంచెత్తింది. ఇరవై ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ.. అంటూ పొంగిపోయింది నాలుగు పదులు దాటిన ఎలిజిబెత్ పూర్వే జురెండల్. 42 ఏళ్ల ఎలిజబెత్‌కు ప్రతి క్షణం అమ్మ తలపులే. జన్మనిచ్చిన ఆమ్మ ఎలా ఉంటుంది? జీవితంలో ఒక్కసారైనా ఆమెను చూడగలనా? మాతృమూర్తి మమకారం ఎలా ఉంటుందో తెలియకుండానే కన్నుమూస్తానా? మాతృదేశాన్ని, మాతృమూర్తి వద్దకు చేరుకోగలనా? అని మదనపడే ఎలిజబెత్‌కు ‘‘మీ అమ్మ ఆచూకీ తెలిసిందంటూ కొన్ని ఫొటోలు మెయిల్‌లో రావటంతో ఆమె సంతోషానికి పగ్గాలు లేకుండా పోయాయి. సినిమా కథను తలదనే్నలా ఉన్న ఎలిజిబెత్ పూర్వాపరాలు తెలుసుకోవాలంటే...
ఎలిజబెత్ పూర్వే జోరెండల్ స్వచ్ఛమైన భారతీయురాలు. స్వీడన్‌లో పెరుగుతున్న ఆమెకు యుక్తవయసు రాగానే తాను స్వీడన్ దేశస్థురాలిని కాదని గ్రహించింది. ఎందుకంటే ఆమె ఆకారం, శరీర రంగు చెప్పకనే చెబుతున్నాయి. పెంచిన తల్లిదండ్రులను అడిగింది. తాను భారతీయురాలినని, దత్తత తీసుకున్నారని తెలుసుకుంది. దత్తత పత్రాల ఆధారంగా ఆమె భారతదేశంలోని అనేక స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించి తన తల్లి ఆచూకీ తెలుపమని కోరింది. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ఇన్నాళ్ల నిరీక్షణ ఫలించింది. కర్నాటకలోని బెల్గామ్‌లోని ఎసిటి (ఘజశఒఆ ళ్దజజూ ఘూఛిచిజషరీజశ) సంస్థ ఎలిజభెత్ తల్లి ఆచూకీ కనుగొని వివరాలను మెయిల్ చేసింది. మహారాష్టల్రోని మారుమూల గ్రామానికి చెందిన తన తల్లిని వెతికిపట్టుకోవటానికి ఇరవై ఏళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ఇన్నాళ్లకు కలుసుకుంది. తన తల్లిని కలుసుకోవటం అద్భుతమైన సన్నివేశం అంటుంది. ఎలిజబెత్ తల్లికి 21 సంవత్సరాల వయసు ఉన్నపుడు భర్త ఓ హత్య కేసులో జైలుకి వెళ్లాడు. పుట్టింటికి వచ్చిన ఆమె ఆ సమయంలో గర్భవతి అని వెల్లడైంది. ఆమె తల్లిదండ్రులు పూణెలోని చిల్డ్రన్స్ హోమ్‌కు ఆమెను తీసుకువచ్చారు. అక్కడ బిడ్డ (ఎలిజబెత్)ని కన్న తరువాత కొన్ని మాసాలు ఎలిజిబెత్ ఆలన పాలన చూసి తదనంతరం ఆ బిడ్డను చిల్డ్రన్స్ హోమ్‌లో వదిలేసి వెళ్లిపోయింది. రెండున్నరేళ్లు వచ్చిన ఎలిజబెత్‌ను స్వీడన్ దేశానికి దంపతులు దత్తతు తీసుకున్నారు.
స్వీడన్‌లోనే ఎలిజబెత్ పెరిగింది. వయసుతో పాటు తనలో వస్తున్న శారీరక మార్పులు ఆమెను స్వీడన్ దేశస్థురాలు కాదని చెబుతున్నాయి. ఇపుడు ఎలిజబెత్ వయసు 42 ఏళ్లు. స్వీడన్ దంపతులకు తాను పెంపుడు కూతుర్ని అని తెలుసుకున్న ఎలిజబెత్ కన్నతల్లి ఎలా ఉంటుందో? ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలని ఆరాటపడింది. 1998 నుంచి ఆమె అనే్వషిస్తోంది. ఇన్నాళ్లకు ఆమె కల ఫలించింది. వెంటనే మహారాష్టల్రోని ఆ కుగ్రామానికి వెళ్లింది. ఎలిజబెత్ వెంట ఓ సోషల్ వర్కర్ కూడా ఉన్నారు. గుమ్మందాటి బయటకు వచ్చిన తల్లిని చూసి ఉద్వేగానికి గురైంది. ఎలిజబెత్ తల్లి రెండవ పెళ్లి చేసుకుందని ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారని తెలుసుకుంది. ఇపుడు ఆమె కొడుకు వద్ద ఉంటుందని తెలుసుకుంది. రెండవ పెళ్లి చేయటానికే ఎలిజబెత్‌ను చిల్డ్రన్స్ హోమ్‌లో వదిలేశారని తెలుసుకున్నది. ఎలిజబెత్‌ను చూసిన రెండవ భర్తకు చెందిన పిల్లలు, అత్త అచ్చెరువొందారు. అసలు తాను ఎక్కడ ఉన్నదీ, ఎవరికి దత్తత ఇచ్చారనే విషయమే తెలియదని తల్లి చెబుతుంటే ఎలిజబెత్‌కి ఒకింత బాధేసినా ఇన్నాళ్లకు భారతదేశాన్ని, భారతీయ తల్లిని కలుసుకున్నాననే సంతోషం ముందు తన తల్లి మాటలు గాలిలో తేలిపోయాయని ఎలిజబెత్ చెబుతుంది. సెప్టెంబర్‌లో జరిగే తన 42వ పుట్టినరోజును ఎక్కడైతే తాను పుట్టిపెరిగిన పూణెలోని చిల్డ్రన్స్ హోమ్‌లో జరుపుకోనున్నట్లు వెల్లడించింది. ఇన్నాళ్లకు తన భారతీయ కుటుంబానికి చెందినదానినని రుజువైందని, ఇది తనకు ఎంతో గర్వంగా ఉందని ఎలిజబెత్ మీడియాకు చెబుతుంది. తన రక్తం, వేర్లు భారతదేశానికి చెందినవని తెలుసుకున్నానని ఆనందం వ్యక్తంచేస్తోంది. రెండు రోజులు గ్రామంలో తల్లితో గడిపిన ఎలిజబెత్ స్వీడన్‌కు బయలుదేరుతూ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ తల్లి కూడా కన్నీరు మున్నీరవుతూ ‘‘ఏడవకు నా బిడ్డ’ అన్న ఆమె మాటలు వింటే ఇప్పటికీ ఆమె తనను ప్రేమిస్తుందని ఎలిజబెత్ ఉక్కిరిబిక్కిరైంది. మరి అదే తల్లి ప్రేమ.

chitram...

కన్నతల్లితో ఎలిజిబెత్