మెయిన్ ఫీచర్

రిసార్ట్స్...రిలాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండి మబ్బుల్లో విహారం...మనసుకు మనోహరం వేసవి టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా..? భార్యాపిల్లలతో కొన్ని రోజులు పాటు విహరించాలనుకుంటే.. రోజూ చేసే పనిని నుంచి కాస్తంత రిలాక్స్ కావాలనుకుంటే.. ఎతె్తైన కొండలు, పిల్లకాలువలు, మనోహరమైన ప్రకృతి దృశ్యాలతో అలరారే రిసార్ట్స్ ఇవి. వీటి గురించి తెలుసుకుంటే మీ కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చక్కటి ఆతిథ్యం లభించినట్లే.
===============

ప్రకృతి ఒడిలో పచ్చని చీర కట్టుకున్న పచ్చిక బయళ్లు.. గలగల పారే సెలయేళ్లు... ఉవ్వెత్తున ఎగసిపడే జలపాతాలు, పక్షుల రాగాలాపన మధ్య సేదతీరాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు. చేతిలో డబ్బుండాలేగానీ కో అంటే కొండ మీద కోతైనా దిగొస్తుందంటారు. ఎటు చూసినా పచ్చదనం... రమణీయంగా ఉండే ప్రకృతి ఒడిలో పరవశించిపోవాలను కుంటే రాచఠీవీతో కనిపించే ఈ రిసార్ట్స్ చక్కటి ఆతిథ్యాన్ని అందిస్తాయి. వేసవి టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా..? భార్యాపిల్లలతో కొన్ని రోజులు పాటు విహరించాలనుకుంటే.. రోజూ చేసే పనిని నుంచి కాస్తంత రిలాక్స్ కావాలనుకుంటే.. ఎతె్తైన కొండలు, పిల్లకాలువలు, మనోహరమైన ప్రకృతి దృశ్యాలతో అలరారే రిసార్ట్స్ ఇవి. వీటి గురించి తెలుసుకుంటే మీ కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చక్కటి ఆతిథ్యం లభించినట్లే.ఈ విడిది గృహాలు ఛార్జ్ కాస్తంత ఎక్కువైనప్పటికీ ఎపుడో ఒక్కసారి కుటుంబంతో గడిపే మధుర క్షణాల కన్నా ఈ ఖర్చు ఏమంత పెద్దది కాదు.
బనసురా హిల్ రిసార్ట్
కేరళలో ఉన్న ఈ రిసార్ట్ సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉంది. 35 ఎకరాల విస్తీర్ణంలో కట్టారు. కేరళలోనే పచ్చటి ప్రకృతికి నెలవైన వేనాద్ ప్రాంతంలో గుడిసెల ఆకారంలో కాటేజీలు కట్టారు. ఈ కాటేజీల చుట్టూ ఉండే టీ తోటల అందాలు, విభిన్న రకాల పక్షులను చూసే భాగ్యం కలుగుతోంది. అంతేకాదు. కాస్తంత దూరంలో దట్టమైన అడవి, అమాయకపు గిరిజన బిడ్డలు నేస్తాలుగా ఉంటారు. వీరి భాష, సంస్కృతిని సైతం అధ్యయనం చేయవచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గ్ధామం. ఇక్కడ గది అద్దె ఒక్క రోజుకు రూ.7000 నుంచి రూ.17,000ల వరకు ఉంటుంది.
విల్డర్‌నెస్ట్స్, గోవా
చొర్లా కనుమల మధ్య నిర్జన ప్రదేశంలో ఉండే ఈ గూడు అడవి జంతువులకు ఆలవాలం. గోవా, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఆనుకుని ఉండటం వల్ల ఈ మూడు రాష్ట్రాల పర్యాటకులు విరివిగా వస్తుంటారు. ప్రకృతి ప్రేమికుడు కెప్టెన్ నితిన్ ధోండ్, ఆతని టీమ్ కలిసి 450 ఎకరాల విస్తీర్ణంలో చెక్కతో ఈ రిసార్ట్‌ను నిర్మించారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. సోలార్ ఎలక్ట్రిసిటీ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ప్రభుత్వం మైనింగ్ తవ్వకాలు జరిపింది. చుట్టూ పచ్చదనం, ఆహ్లాదాన్ని అందించే రమణీయ ప్రాంతం కావటంతో కెప్టెన్ ధోండ్ 450 ఎకరాలు కొనుగోలు చేసి దీనిని నిర్మించారు. ఇక్కడ స్లాత్ బేర్, ఓల్ఫ్ స్నేక్, కొన్ని అంతరించిపోతున్న రాబందులు కనువిందు చేస్తాయి. అంతేకాదు రిసార్ట్ చుట్టూ 30 వేల చెట్లను నాటించారు. చక్కటి భోజనంతో పాటు అక్కడే దొరికే హుర్రాక్ అనే పానీయాన్ని కూడా వడ్డిస్తారు. వీటితో కలిపి రోజుకు రూ.6000లు వసూలు చేస్తారు.
వైల్డ్ మహసీర్, అస్సాం
చుట్టూ టీ తోటలు. పక్కనే పారే బ్రహ్మపుత్ర నది సవ్వడులు. టీ తోటల అందాలు చూడటానికి ఎక్కడో లాడ్జీలోనో, హోటల్‌లోనో దిగటం ఎందుకు? ఎంచక్కా ఈ వైల్డ్ మహసీర్ రిసార్ట్ ఆహ్వానం పలుకుతుంది. బ్రహ్మపుత్ర నది అందాలు చూడాలంటే ఇక్కడ విడిది చేయాల్సిందే. డాల్ఫిన్స్ విన్యాసాలను కనులారా వీక్షించవచ్చు. ఉదయమే జీప్‌లో కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించుకోవచ్చు. ఈ రిసార్ట్‌ను ఆనుకుని ఓ గిరిజన గూడెం కూడా ఉంది. ఆహ్లాదాన్ని అందించే వరండాలు, టెన్నిస్, గోల్ఫ్ క్లబ్ కూడా ఉన్నాయి. అస్సామీ, ఆంగ్లో-ఇండియన్ వంటకాలను వడ్డిస్తారు.
ఖెమ్ విల్లాస్
జైపూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విల్లా ఎనిమిది కాటేజ్‌లు, ఏడు టెంట్లతో అలరారుతోంది. విల్లాలో నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లుగా ఉంటుంది. పులులకు ఆలవాలమైన రాంతామ్‌బర్ కనిపిస్తాయి. అటవీ ప్రాంతంతో నడుచుకుంటూ వెళుతుంటే చెంగుచెంగున ఎగిరే కృష్ణ జింకలు, దుప్పులు పలుకరిస్తాయి. ఒంటెల మీద స్వారీ చేయవచ్చు. చంబల్ నదీ చిరు సవ్వడితో పాటు చిన్ని చిన్ని గువ్వలు చేసే రాగాలను వినవచ్చు. ఉదయించే సూర్యుణ్ని వీక్షించవచ్చు. గదుల అద్దె భోజన వసతితో కలిపి రూ.11,000 నుంచి రూ.25,000ల వరకు వసూలు చేస్తారు.
శ్యామ్-ఈ-శారద్ విలేజ్ రిసార్ట్
గుజరాత్ రాష్ట్రంలోని హోడ్కా గ్రామస్తులు నిర్వహించే ఈ రిసార్ట్ స్థానిక సంప్రదాయ రుచులతో నోరూరించే వంటకాలతో ఆహ్వానం పలుకుతుంది. మట్టిని నమ్మే గ్రామస్తులు ఈ రిసార్ట్‌కు మట్టితో వేసిన విభిన్న రంగులు ఆచ్చెరవొందిస్తాయి. కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానికులు నిర్వహించే ఈ రిసార్ట్‌లో బస చేస్తే దాదాపు మూడు వేల రకాల పక్షులను చూడవచ్చు. మరొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ రిసార్ట్స్‌లో టీవీ ఉండదు. వసతి ఖర్చు చాలా చౌక. రూ.3,200 నుంచి రూ.5,000ల వరకు ఉంటుంది.
ఆనంద్ - ఉత్తరాంచల్
ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే హిమాలయాలలో పొగ మంచు మధ్య పర్యాటకుల మనసుల్లోనూ భక్తి భావాన్ని నింపేందుకు ఉత్తరాంచల్‌లో ఏర్పాటుచేసిన ఈ ఆనంద్ రిసార్ట్ దోహదం చేస్తుంది. ఈ రిసార్ట్‌లో విడిది చేసే పర్యాటకులకు యోగా, ఆయుర్వేదం, వేదాంత బోధన చేస్తారు. ఓ వైపు గంగా నది పరవళ్లు.. మరోవైపు సాల్ అటవీ ప్రాంతం నుంచే పిల్ల గాలుల సవ్వడి మనసుకు ఉత్తేజాన్ని, మదిలో ఆధ్యాత్మిక జిజ్ఞాసను కలిగిస్తాయి. మంచు కొండల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు. తెల్లటి పాల నురుగులాంటి నీళ్లలో మునిగి పునీతులుకావచ్చు. ప్రసిద్ధ రిషికేశ్‌కి జీపులో వెళ్లి సందర్శించే సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు.
మాచన్, మహారాష్ట్ర
మహారాష్టల్రోని లోనావాలాలో ఉండే ఈ రిసార్ట్ ఎతె్తైన చెట్లపై నిర్మించారు. పూణె నుంచి గంటన్నర ప్రయాణం చేస్తే ఈ విడిదికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి కొరైగాడ్ ఫోర్ట్, లోహగాడ్ ఫోర్ట్, కర్లా, భాజ గుహలు, ప్రాచీన 22రాక్ కట్ కేవ్స్‌ను సందర్శించుకోవచ్చు. ఖర్చు బ్రేక్‌ఫాస్ట్‌తో కలుపుకొని రూ.8,000 నుంచి రూ.25,000ల వరకు ఉంటుంది.
అద్భుతమైన ఆర్కిటెక్చర్, విశాలమైన గదులు, పచ్చటి లాన్, సైట్ సీయింగ్ ప్లేస్‌లకు అతి దగ్గరగా ఉండే ఈ ఎనిమిది విడిది లోగిళ్లు మీరు, మీతోపాటు వచ్చేవారి మనసు దోచుకునే పచ్చ పచ్చని రిస్టార్స్.

-హరిచందన