మెయిన్ ఫీచర్

చెదరని అందం.. భాగల్‌పురితో బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్ కాలంలో మొగ్గతొడగిన భాగల్‌పురి చీరలు నేడు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయ. పట్టు సిల్క్‌తో పెనవేసుకుని తయారయ్యే ఈ చీరలు ఫ్యాషన్ డిజైనర్ల కొంగు బంగారమయ్యాయ. సామాన్యుల నుంచి సినీతారల వరకు ధరించే విధంగా ఈ చీరల ధరలు అందుబాటులో ఉండబట్టే మగువల మనసు దోచుకుంటున్నాయ.

భాగల్‌పురి చీరలు ఎప్పటికప్పుడు కొత్త అందాలను సంతరించుకుని మార్కెట్లో కనువిందు చేస్తుంటాయి. వందల ఏళ్ల నుంచి ఈ చీరలుకున్న క్రేజ్ ఈనాటికీ చెక్కు చెదరలేదంటే కారణం మగువలు చూపించే మక్కువ అలాంటిది. మేనికి మెత్తగా హత్తుకునే భాగల్‌పురి చీరను సినీ తారల నుంచి సామాన్యుల వరకు ధరించే విధంగా ధరలు అందుబాటులో ఉండటం వల్ల అందరూ ఇష్టపడుతుంటారు. బీహార్‌లోని గంగానది పక్కన ఉన్న ఓ చిన్న పట్టణమే భాగల్‌పూర్. మొగల్ కాలం నుంచే భాగల్‌పురి అందాలు మొగ్గతొడిగాయి. ఇక్కడ ప్రత్యేకంగా తయారయ్యే ఫాబ్రిక్ సిల్క్‌నే భాగల్‌పురి సిల్క్ అంటారు. అందుకే ఈ పట్టణాన్ని సిల్క్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. పట్టు నుంచి తీసే భాగల్‌పురి అనే ప్రత్యేకమైన ఈ సిల్క్ ఇక్కడ మాత్రమే తయారవుతోంది. ఈ పట్టణంలోకి అడుగుపెడితే వందలాది మంది నేతపనివారు ఈ సిల్క్‌ను నేస్తూ ఉంటారు. ఈ ప్రత్యేక సిల్క్‌ను తయారుచేయటంలో వీరు నైపుణ్యం సంపాదించారు. దాదాపు 35వేల నేత కార్మికులు 25000 మగ్గాలపై నేస్తుంటారు. సంవత్సరానికి రూ.100 కోట్ల వ్యాపారం జరగుతోంది. లక్షమంది పనివారు పట్టు నుంచి సిల్క్ తయారు చేసే పనిలో నిమగ్నమవుతుంటారు. పట్టు సిల్క్‌తో పెనవేసుకుని తయారయ్యే ఈ చీరలు ఫ్యాషన్ డిజైనర్ల కొంగు బంగారం అయ్యిందంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లో బోలెడన్నీ డిజైన్లలో, రంగులలో లభ్యమవుతున్నాయి. నోములు, వ్రతాలు నోచుకునే సందర్భంలోనే కాదు పండుగలు, ప్రత్యేకమైన ఫంక్షన్లలోనూ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయ. కట్టుకుంటే సౌకర్యవంతంగా, హుందాతనాన్ని తెచ్చిపెట్టే ఈ చీరలు నారీమణుల మనసును ఇట్టే దోచుకుంటున్నాయి.. కట్టుకుంటే సౌకర్యవంతంగా, హుందాతనాన్ని తెచ్చిపెడతాయి. ప్రస్తుతం మాఘమాసం. అంటే పెళ్ళిళ్ళ సీజన్ అన్నమాట. పెళ్లి ఇంట్లో కొత్త చీరలు ఎంత హడావుడి చేస్తాయో, భాగల్‌పురి చీరలు కూడా మార్కెట్లో అంతే సందడి చేస్తున్నాయి. మరింకెందుకు ఆలస్యం..