సబ్ ఫీచర్

సహనం శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతరుల అభిప్రాయాలను మనం గౌరవించినపుడే సహనం అలవడుతుంది. అయితే, నేటి కాలంలో చాలామంది ఎవరికివారు తామే గొప్ప అనే అపోహలో బతుకుతున్నారు. కొంతమంది ‘మేం చెప్పిందే వేదం, మాకు మాత్రమే అన్నీ తెలుసు’ అన్న భ్రమలో వుంటారు. ఇలాంటివారు ఎదుటివారి గొప్పతనాన్ని, మనోభావాల్ని గుర్తించకుండా అసహనం ప్రదర్శిస్తుంటారు. ఎవరైనా సరే తమ అభిప్రాయాలని స్వేచ్ఛగా ప్రకటించుకోవాలని చూస్తారు. అటువంటపుడు వారు చెప్పేదానిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే ఇబ్బందే లేదు. కానీ, చాలా సందర్భాలలో కొందరు ఇతరులు చెప్పేది వినకుండా అతి తొందరగా సహనాన్ని కోల్పోతుంటారు. తమ అభిప్రాయాలతో ఎదుటివారిని అంచనా వేస్తారే తప్ప సహనం చూపరు. ఏకపక్షంగానే వ్యవహరిస్తుంటారు.
మారుతున్న కాలంతోపాటు అందరిలోనూ అభిప్రాయాలు, అలవాట్లు మారతాయి. ఈ విషయాన్ని గమనించనివారు ఇతరులపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందుకు నిదర్శనంగా మనం ఎన్నో ఉదంతాలను నిత్యం చూస్తుంటాం. రాము, సోము అనే ఇద్దరు వ్యక్తులు ఒకేసారి వ్యాపారం ప్రారంభించారు. రాముకి వ్యాపారంలో బాగా కలిసి రాగా, సోము కష్టాలపాలయ్యాడు. దీంతో సోముకి రాముమీద ద్వేషం కలిగి తగాదాలకు దిగాడు. క్రమంగా ఇద్దరి మధ్య వైరం పెరిగి విడిపోయారు. సోములో అసహనం రావడానికి కారణం అతనిలో భద్రతారాహిత్య భావమే. దీనివల్ల అతనిలో వివేకం నశించిపోయి, సహనం మటుమాయమైంది. దీనివల్ల మనశ్శాంతిని కోల్పోవడం తప్ప అతను దేన్నీ సాధించలేకపోయాడు. సహనాన్ని అలవరచుకుంటే కష్టాలకు అలవాటుపడి, ఏదో ఒకరోజు విజయం సాధిస్తామనే ధీమాతో వుంటారు. దీనికి ఆత్మవిశ్వాసం తోడుగా వుండాలి. ఆత్మవిశ్వాసం వున్నవారు దేనికీ భయపడరు. పరిస్థితులకు భయపడేవారు అసహనం చూపిస్తారు. ఇది వ్యక్తిత్వ వికాసానికి విఘాతం కలిగిస్తుంది. అసహనం అల్పబుద్ధికి చిహ్నం. ఎదుటివారిని అభిమానించడం, వారి భావాలను ఆదరించడం తెలిస్తే సహనం దానంతట అదే వస్తుంది. ఒకవేళ ఎదుటివారు వితండవాదనకు దిగినా పట్టించుకోకుండా ఉండడమే సరైన సమాధానం. సహనం ఉన్నవారు శారీరక, మానసిక ఆరోగ్యాలు కలిగి ఉంటారు.
-సుబ్బలక్ష్మి