Others

అతివల సంక్షేమానికి అలుపెరుగని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల శ్రేయస్సు కోసం ఆమె దాదాపు మూడు దశాబ్దాలుగా నిరంతర సమరం సాగిస్తున్నారు. విద్య, వైద్యం, సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత వంటి రంగాల్లో స్ర్తిలకు న్యాయం జరగాలని వివిధ స్థాయిల్లో ఆమె తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీలో ఉంటున్న రంజనాకుమారి (70) కళాశాలలో చదివే రోజుల్లోనే హక్కుల ఉద్యమాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ, ‘సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్’ (సిఎస్‌ఆర్) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సాటి మహిళల ఉన్నతి కోసం అవిరళ కృషి చేస్తున్నారు. పేదింటి మహిళలకు చదువు, న్యాయ సలహాలు, ఉపాధి అందుబాటులో ఉండేలా ఆమె పాటుపడుతున్నారు. తరచూ విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళుతూ అక్కడి మహిళల సమస్యల గురించి ఆమె ఆరా తీస్తుంటారు. మహిళా సంక్షేమానికి సంబంధించి పలు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు సలహాలు ఇస్తుంటారు. లింగ వివక్ష కారణంగానే మన దేశంలో ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు వంటి అకృత్యాలు నిత్యకృత్యమైపోయాయని రంజన చెబుతుంటారు. ఆడపిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులు వివక్ష చూపడం వల్ల సమాజంలో పురుషాధిక్య భావజాలం ఇప్పటికీ బలంగా ఉందంటారు. తమకన్నా అమ్మాయిలు తక్కువవారన్న భావంతో అబ్బాయిలు లైంగిక నేరాలకు పాల్పడుతున్నారని రంజన విశే్లషిస్తుంటారు.
ఆడవారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా, ఒంటరిగా తిరిగేందుకు ప్రయత్నించినా, స్వతంత్ర భావాలతో వ్యవహరించినా మగవారు తట్టుకోలేకపోతున్నారంటే- పురుషాధిక్యతే అందుకు కారణం అంటారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరిగినా నిందితులకు శిక్షలు పడడం లేదంటే అందుకు కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, ధనం ప్రభావం వంటివి ప్రధాన కారణాలని ఆమె అంటారు. బాధిత మహిళలకు న్యాయం జరగాలంటే తగిన ఆర్థిక సహాయం, పునరావాసం కల్పించడమే కాదు, నిందితులకు కఠిన శిక్షలు పడాలని అంటారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేసినపుడే బాధితులకు నిజమైన సాంత్వన దక్కుతుందని ఆమె వాదిస్తారు. కేవలం డబ్బుతోనే బాధితులకు న్యాయం జరగదని, మహిళలను మానసికంగా, శారీరకంగా హింసించడం అత్యంత అనాగరికమని రంజన అంటారు.
మహిళలపై యాసిడ్ దాడుల సంఘటనలు నేడు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయని, పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించినపుడే ఇలాంటి కిరాతకాలు తగ్గుముఖం పడతాయని రంజనా చెబుతుంటారు. సామాజిక, రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు తెచ్చేందుకు మహిళలు మరింత సంఘటితంగా ఉద్యమించాలంటారు. వ్యభిచారం, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా కలిసి పనిచేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. ‘పిల్లలు పనిలో కాదు.. బడిలో ఉండాల’న్న నినాదం ఆచరణలో అమలు జరగాలని, ఈ విషయమై తమ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తున్నట్టు ఆమె చెబుతుంటారు. దేశ రాజధాని దిల్లీలో ప్రతిరోజూ కనీసం అయిదుగురు పిల్లలు తప్పిపోతుంటారని, వారిలో ఆడపిల్లల్ని వేశ్యాగృహాలకు, మగపిల్లల్ని బిచ్చగాళ్ళ స్థావరాలకు తరలిస్తుంటారని చెబుతున్నారు. వారణాసి (యుపి)లో జన్మించిన రంజన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (దిల్లీ)లో పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. అయిదేళ్ళపాటు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోప్రొఫెసర్‌గా పనిచేశారు. మహిళా సమస్యలపై జరిగిన పలు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని వివిధ దేశాల్లో పర్యటించారు. ‘ఉమెన్ పవర్ కనెక్ట్’ (డబ్ల్యుపిసి) సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ తరచూ వీధి నాటకాలు ప్రదర్శిస్తుంటారు.

-బాబు