ఐడియా

చలిగాలుల వేళ ఆయిల్ మసాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలిగాలుల తీవ్రత ఫలితంగా చర్మసంబంధ సమస్యలను ఎదుర్కొనేవారు పలురకాల మసాజ్ పద్ధతులను ఆశ్రయిస్తుంటారు. చర్మ సంరక్షణకు, మంచి నిగారింపు కోసం మసాజ్ చేసుకోవడం మంచిదే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలను పాటించడం అవసరం. ఆయిల్ మసాజ్‌కు సాధారణంగా నువ్వుల నూనెను వాడతారు. ఆయల్ మసాజ్‌తో చర్మ సౌందర్యం బాగుంటుంది, శరీరానికి వెచ్చదనమూ కలుగుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కూడా నేడు కొందరు ఉపయోగిస్తున్నారు. ఈ మసాజ్‌ను గంటసేపు చేస్తారు. మసాజ్ చేసేటప్పుడు కాస్త బలంగా శరీరాన్ని మర్దించాలి. దీంతో శరీరానికి తగినంత వేడి లభిస్తూ బిగుతుదనం సడలుతుంది, శరీరానికి చురుకుదనం వస్తుంది. పొడి చర్మం వున్నవారు ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయించుకోవడం మంచిది. చలికాలంలో మసాజ్ వయోభేదం, లింగ భేదం లేకుండా అందరికీ అవసరమే. పొడి చర్మం ఉన్నవారు వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్, బాత్ మసాజ్ చేయించుకోవాలి. గోరువెచ్చని నీటిలో నువ్వుల నూనె లేదా కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ ఒక చెంచాడు కలపాలి. ఇలా చేస్తే చర్మం తేమగా ఉంటూ పగుళ్ల బారిన పడకుండా ఉంటుంది. చలికాలంలో స్నానానికి సబ్బులకు బదులు సున్నిపిండిని వాడటం మంచిది. గ్లిజరిన్ సబ్బులు వాడటం వల్ల చర్మం ఎపుడూ తేమగా వుంటుంది. లిప్‌బామ్ కానీ కోల్డ్‌క్రీమ్ లేదా నెయ్యి రాస్తుంటే పెదాలపై చర్మం పగలదు. చర్మానికి నాణ్యమైన మాయిశ్చరైజర్, కోల్డ్‌క్రీమ్‌లు వంటివి రాసుకోవడం మంచిది.

-కె.నిర్మల