Others

మొక్కలు నాటడంలో రికార్డు! (వార్త-వ్యాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిత హారం పేరిట- గ్రామ గ్రామాలా, వాడవాడలా మొక్కలు నాటే ఉద్యమం ఒకటి తెలంగాణలో జోరుగా సాగుతున్నది. కానీ, హరితహారం విషయంలో- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను ఉత్తర ప్రదేశ్ కొట్టేసింది. ఈమధ్యనే ఉత్తరప్రదేశ్ ఇరవై నాలుగు గంటల కాలంలో 4 కోట్ల 93 లక్షల మొక్కల్ని నాటి ఇంతవరకూ పాకిస్తాన్ పేరిట వున్న రికార్డును బ్రద్దలు కొట్టింది. 2013లో పాకిస్తాన్ 24 గంటల కాలంలో ఎనిమిది లక్షల నలభై ఏడు వేల మొక్కల్ని నాటిందన్న రికార్డు వుంది గాని- ఉత్తరప్రదేశ్ ఉత్సాహం ఏకంగా 493 లక్షల సంఖ్యను అందుకుంది. రాష్ట్రం మొత్తంమీద ఐదు కోట్ల మొక్కల్ని దేశంలో అత్యధిక జనాభాగల ఉ.ప్ర. రాష్ట్ర వాసులకు పంచిపెట్టింది. ఈ ఉద్యమంలో ఎక్కడపడితే అక్కడ ఆఖరికి రైలు పట్టలమధ్య కూడా నాటేశారు మొక్కలు!
కనే్నజ్ దగ్గర అడవులలోకి పోయి కూడా జనాలు మొక్కలు పాతిపెట్టేశారు. ఈ ఉద్యమంలో ఎనిమిది లక్షలమంది వాలంటీర్లు పాల్గొన్నారు. అయితే యిందులో నాటిన మొక్కలన్నీ బ్రతుకుతాయా అన్నది సందేహమే కనుక రుూ ఉద్యమాన్ని ఇంకా కొనసాగించాలనే గవర్నమెంటు అనుకుంటున్నది అని ముఖ్యమంత్రి అఖిలేష్ ఉవాచ!
2030 నాటికి, రెండొందల ముప్ఫయి ఐదు కోట్ల మొక్కలు నాటాలని, అందుకు అవసరమైన నిధులను సెంట్రల్ గవర్నమెంటు కేటాయించింది. సైనికులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. కాకపోతే, ఎంత శ్రద్ధ వహించినా నలభై శాతం మొక్కలు చచ్చిపోతాయన్నది అధికారుల అంచనా! గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు లెక్కలు ఆరా తీసుకుంటూనే వున్నారులెండి!

-వీరాజీ