Others

బ్యాటింగ్ మనోహరుడి’కి 67!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ మెగాస్టార్ సునీల్ మనోహర్ గవాస్కరుడికి అరవై ఆరు పూర్తయినాయ్. కోకొల్లలుగా పుట్టినరోజు (జూలై 10) శుభకాంక్షలు అందాయి.
‘‘నన్ను ప్రోత్సహించిన లెజెండ్’’ అని సచిన్ అంటే, ‘‘సునీల్ ‘షోలే’ సినిమాలాంటివాడు. హెల్మెట్ లేకుండా పదివేల పరుగులు, ముప్ఫయి సెంచురీలు సాధించిన ఏకైక టెస్ట్ వీరుణ్ని ఇంకేమంటాం?’’ అన్నాడు త్రిబుల్ సెంచరీల హీరో వీరేంద్ర సెవాగ్.
ఇవాళ్టికీ, సునీల్ గావస్కర్ క్రికెట్ వైభవ చరిత్రకీ సజీవ ప్రతీక! ‘డెబ్యూ సిరీస్’లో అందరికన్నా ఎక్కువ పరుగులు చేసిన రికార్డు అతనికుంది, యింకా మన టీమ్ పర్యటన మొదలెట్టిన వెస్టిండీజ్‌మీద సునీల్ చేసినన్ని సెంచురీలు మరెవ్వరూ చేయలేదు. ఒకే టెస్టులో సెంచురీ, డబుల్ సెంచురీ చేసిన రికార్డుల రాజు సునీల్‌ని బి.బి.సి - ‘జిబ్రాల్టర్ రాక్’ అని కొనియాడేది.
చిలిపితనం, గడుసుతనం కూడా ఎక్కువే రుూ ‘పొట్టి క్రికెట్ మేధావి’కి. క్రికెట్ నెపోలియన్ అన్న నిక్‌నేమ్ వుంది సునీల్ గావస్కర్‌కి. 1974లో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లండ్‌తో ఆడిన టెస్ట్‌లో గావస్కర్‌కి హెల్మెట్ లేదు కనుక ఉంగరాల జుట్టు మొహంమీద పడి బ్యాటింగ్‌కి ఇబ్బంది పెడుతూ వుంటే అంపైర్ డిక్కీబర్డ్‌ని ‘‘రుూ ముంగురులు పడకుండా ఏమైనా చెయ్యాలి’’ అంటూ అడిగాడు సునీల్. డిక్కీబర్డ్ వెంటనే ఆ ఉంగరాలను తన దగ్గరున్న సిజర్స్‌తో కత్తిరించేశాడు. సునీల్ తర్వాత సెంచురీ కొట్టాడు.
గావస్కర్ నటుడు కూడా. 1974లో ‘సావలీఁ ప్రేమాంబి’ అనే మరాఠీ సినిమాలో మధుమతి అనే హీరోయిన్‌తో హీరోగా నటించాడు. డ్యాన్సింగ్ డ్యూయెట్స్ కూడా పాడాడు. అతని పేరున నాలుగు జీవిత విశేషాల పుస్తకాలున్నాయి. అదో రికార్డు. అందర్నీ జోకులు కట్‌చేసి ఆట పట్టిస్తాడు గానీ కుక్కలంటే భయం. కుక్క వుందీ అంటే ఆ ఛాయలకి కూడా పోడు!
పద్మభూషణ్ సునీల్ ఇండియన్ క్రికెట్‌లో నేటికీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సునీల్ మనోహరుడే నేటికీ!