మెయిన్ ఫీచర్

సరికొత్త నాయకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం ఏమైపోతుందో?
ఆర్థికంగా దివాలా తీస్తామా?
ఒంటరిగా మిగిలిపోంకదా!
నిలబడగలమా? ముందుకు నడిపేది ఎవరు?
‘బ్రెగ్జిట్’ తరువాత ఇలా సవాలక్ష సందేహాలతో
సతమతమైన బ్రిటన్ పౌరులకు ఓ ఆశాకిరణం కన్పించింది...
బ్రిటన్ రాజకీయ యవనికపై మెరిసిన
సరికొత్త నాయకి..్థరిసా మే..
ఆమె మాట కఠినం..
ఆమె వైఖరి సుధృఢం..
కౌన్సిలర్ స్థాయినుంచి
ప్రధానిగా ఎదిగిన వ్యక్తి..
‘చెత్తపార్టీ’ని అధికార పీఠం
ఎక్కించిన నేత...
సుదీర్ఘకాలం హోంమంత్రిగా
పనిచేసిన అతివ...
ఉక్కుమహిళ ‘్థచర్’కు
వారసురాలిగా పేరుప్రతిష్టలు..
‘బ్రెగ్జిట్..బ్రెగ్జిటే..మరోసారి
ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు? ముందుకువెళదాం’ అంటున్న
ధీరవనిత థెరిసా.

‘నాకు దేశ పరిస్థితులన్నీ తెలుసు. నేను ఆడంబర రాజకీయవేత్తను కాను. విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇస్తా. మంత్రివర్గ సహచరులంతా నాకు మద్దతుగా ఉంటారని భావిస్తున్నా’
-్థరిసా మే, బ్రిటన్ నూతన ప్రధాని

ఇవీ విశేషాలు..
-వందేళ్ల బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో అత్యధిక కాలం హోం సెక్రటరీగా పనిచేసిన ఏకైక మహిళా ప్రజాప్రతినిధి.
-1980లో ఆమె ఫిలిప్‌ను వివాహమాడారు. భర్తే తనకు రక్షణనిచ్చే ‘రాక్’ అని చమత్కరిస్తారు.
-వ్యక్తిగత జీవితాన్ని ఇంటికే పరిమితం చేసే ఆమెకు ఆరోగ్యకారణాల వల్ల పిల్లలు లేకపోవటం పెద్దలోటు.
-కన్సర్వేటివ్ పార్టీకి తొలి మహిళా చైర్మన్‌గా ఎంపికయ్యారు.
ఆమె తల్లిదండ్రులు హుబెర్ట్, జైడే.
-2020 వరకు బ్రిటన్ ప్రధానిగా ఆమెకు తిరుగులేదని రాజకీయ విశే్లషకుల అభిప్రాయం.
*
రవి అస్తమించని రాజ్యానికి కేంద్రంగా భాసిల్లిన బ్రిటన్ ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలకు దిక్సూచి. ఎన్నడూ చూడని విభిన్నమైన పరిస్థితుల్లో..బ్రిటన్ పౌరులు కలవరపడుతున్న వేళ.. బ్రిటన్‌కు రెండవ మహిళా ప్రధానిగా థెరిసామే అధిష్టించారు. 59 ఏళ్ల థెరిసా, కామరెన్ మంత్రివర్గంలో హోంమత్రిగా
పనిచేశారు. ఉక్కుమహిళ మార్గరెట్ థాచర్ తరువాత అంతటి ధృడవైఖరిని కనబరిచే మహిళగా ఆమెకు పేరుంది. నిజానికి కామరెన్ రాజీనామా తరువాత కొత్త ప్రధాని పదవికోసం కన్సర్వేటివ్ పార్టీలో పలువురు పోటీపడ్డారు. థెరిసా మే సరైన అభ్యర్థిగా పేర్కొంటూ, మరో మహిళామంత్రి ఆండ్రియా లీడ్స్‌మ్ పోటీ నుంచి తప్పుకోవటం ఆమె గొప్పతనానికి నిదర్శనం.
పార్లమెంట్‌లో ప్రత్యేక ముద్ర..
1997లో పార్లమెంట్ సభ్యురాలిగా అడుగుపెట్టిన థెరిసా మే హోం సెక్రటరీగా 2010లో ఎంపికయ్యారు. 1956లో ఇంగ్లాండ్ చర్చి మతగురువు హుబెర్ట్ బ్రేసర్, జైడే బార్నెస్ దంపతులకు జన్మించిన థెరిసా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లలో విద్యాభ్యాసం చేశారు. ఆమెకు 25 ఏళ్ల వయసు ఉన్నపుడు తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించటంతో అనేక ఆటుపోట్లకు గురయ్యారు. ఎగువ మధ్య తరగతి కుటుంబానికి ఆమె స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగారు. చట్టసభలలోకి రాకముందు ఆమె ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా పనిచేశారు.
కౌన్సిలర్ నుంచి ప్రధానిగా..
మెర్టన్ ప్రాంతంలో స్థానిక కౌన్సిలర్‌గా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె ఒక్కోమెట్టూ ఎక్కుతూ ప్రధాని స్థాయికి చేరుకున్నారు. దాదాపు దశాబ్దకాలంపాటు ఆమె కౌన్సిలర్‌గానే సేవలందించారు. 2002లో కన్సర్వేటివ్ పార్టీకి తొలి మహిళా చైర్మన్‌గా పగ్గాలు చేపట్టారు. నిజానికి ఆమె బాధ్యతలు చేపట్టేనాటికి పార్టీకి ‘చెత్త పార్టీ’ అన్న ముద్రపడింది. ఆ ముద్రను చెరిపేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో విజయం సాధించారు. వందేళ్ల బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో అత్యధిక కాలం హోం సెక్రటరీగా పనిచేసిన మహిళగా థెరిసా రికార్డు సాధించారు. ప్రస్తుత పరిస్థితులలో బ్రిటన్‌కు అత్యంత సమర్థవంతమైన ప్రధానిగా థెరిసాయే సరైన వ్యక్తి అన్న భావం అటు మంత్రివర్గ సహచరుల్లోను, ప్రజల్లోనూ నెలకొంది. ఫిలిప్ మేను 1980లో వివాహమాడిన థెరిసా దంపతులకు పిల్లలు లేరు. 2009 నుంచి పార్టీలో పట్టు పెంచుకుంటూ వచ్చిన ఆమె ఇప్పుడు ప్రధాని పీఠం అధిష్టించారు.
సమర్థతకు నిదర్శనం
కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడటం, చెప్పదలచుకున్న విషయాన్ని కఠినంగా, సూటిగా చెప్పడం ఆమె నైజం. అయితే ఆమె మనస్సు సున్నితమని సన్నిహితులు చెబుతారు. రాజకీయాల్లో ఆమె ఘన విజయాలు సాధించడానికి ఈ వైఖరే అక్కరకొచ్చిందని పరిశీలకులు అంటూంటారు. విభిన్నమైన ఆమె వ్యక్తిత్వాన్ని చూసే కెమెరన్ తన మంత్రివర్గంలో కీలకమైన పదవిని కట్టబెట్టారని అంటారు. మాట కఠినంగా ఉన్నా పనితీరు నచ్చటం వల్లే బ్రిటన్ ప్రజలు ఆమెను ప్రధానిగా ఆమోదించారు. బానిసత్వ పోకడలు ఎక్కువగా ఉండే బ్రిటన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై విమర్శలు వచ్చినపుడు ఆమె స్పందిస్తూ.. ‘హ్యూమన్ రైట్స్ చట్టాన్ని వ్యక్తిగతంగా తాను ఇష్టపడతానని, కాని అమలు చేయటంలోనే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయని’ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇలా ముక్కుసూటిగా మాట్లాడటం కొంతమందికి నచ్చకపోయినా ఆమె క్యాబినెట్‌లో బలమైన మంత్రిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు.
బ్రెగ్జిట్ అంటే బ్రెగ్జిటే..
బ్రిటన్ చరిత్రలో బ్రెగ్జిట్ బాంబ్ వల్ల ఆ దేశ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైంది. బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణపై ఆమె మాట్లాడుతూ ‘బ్రెగ్జిట్ అంటే బ్రెగ్జిట్’ అని వ్యాఖ్యానిస్తూ మరో ప్రజాభిప్రాయ సేకరణకు తావులేదని స్పష్టం చేశారు. ‘నేను ఆడంబర రాజకీయవేత్తను కాను. టెలివిజన్ స్టూడియోల చుట్టూ తిరగాల్సిన అవసరం నాకు లేదు.
నేను పార్లమెంట్ బార్‌కు వెళ్లి చిత్తుగా తాగాలని కూడా అనుకోను. విధి నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను’ అని స్పష్టం చేస్తూ బ్రిటన్ ప్రజానీకానికి భరోసా కల్పిస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతానికే పరిమిత చేసే థెరిసా మెజార్టీ మంత్రులు తనతో కలసి పనిచేస్తారని ఆశిస్తున్నానంటున్నారు. ప్రజలు, న్యాయం తన పక్షాన ఉంటే అవకాశాలు అందివస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వంట చేయటం ఇష్టం
థెరిసాకు రకరకాల వంటలు చేయటం హాబీ. దాదాపు వందకు పైగా వంటల పుస్తకాలు ఆమె వద్ద ఉన్నాయి. నోరూరించే వంటలను ఇష్టపడే థెరిసాకు మధుమేహాం వ్యాధి ఉండటంతో రోజులో చాలాసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు చేసుకుంటూ అదుపులో ఉంచుకుంటారు.

పాదరక్షలంటే మక్కువ...
థెరిసా పార్లమెంట్‌లోకి అడుగుపెడితే అందరి చూపు ఆమె ధరించే పాదరక్షలపైనే నిలుస్తాయి. అందమైన రకరకాల పాదరక్షలు వేసుకోవడాన్ని ఆమె ఇష్టపడతారు. ఫొటోగ్రాఫర్లకైతే ఆమె పాదరక్షలు ఓ లక్ష్యం. ఆమె ధరించే కొత్తకొత్త పాదరక్షల ఫొటోలను తీయడానికి పోటీపడతారు.

-టి.ఆశాలత