Others

దేవుడే దిగివచ్చాడా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కోసారి జీవితంలో నమ్మకాన్ని వమ్ముచేసే సంఘటనలు జరుగుతాయి. కానీ, నమ్మకాన్ని ప్రోదిచేసే సంఘటనలూ జరుగుతాయి.
అంబరీష్ రాయ్ చౌధురీ అనే యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్ ముంబాయి లోకల్ రైల్లో ప్రయాణం చేస్తూ ‘వడాలా’ స్టేషన్ దగ్గర రాత్రి పదకొండు గంటలవేళ రైలు దిగి ఇంటికి వెళ్లిపోయేదాకా తన ‘మాక్‌బుక్ ఎయర్’- (లాప్‌టాప్ కంప్యూటర్) వున్న బ్యాగ్ తన వీపుమీదనుంచి జారి పడిపోయింది అన్న సంగతి గమనించుకోలేదు. జూన్ పదవ తారీఖున జరిగిన రుూ సంఘటనను వెంటనే పోలీసులకి రిపోర్టు చేశాడు. వాళ్లు వచ్చే, పోయే రైళ్లన్నీ గాలించారు. ఆ ‘మాక్‌బుక్’ (ఎలక్ట్రానిక్ నోట్‌బుక్)లో చాలా ముఖ్యమైన సమాచారం వుంది. కానీ, రుూ రోజుల్లో ‘లాప్‌టాప్’, ‘స్మార్ట్ఫోన్లూ’ దొరికితే వెంటనే అమ్ముకోకుండా ఎవరేనా వుంటారా?
అంబరీష్ నాస్తికుడు. దేవుడిమీద కూడా భారం వెయ్యలేడు పాపం! కానీ, ఆశ్చర్యం! అది పోయిన రెండో రోజున అంబరీష్ చౌధురీ యింటికి ఓ మనిషి వచ్చి తలుపు కొట్టాడు. ‘‘ఇది మీ బ్యాగేనా? అందులో చినిగిపోయిన కవర్‌మీద మీ చిరునామా వుంది. అది చూసి తీసుకువచ్చాను. ఈ కంప్యూటర్ మీ ప్రాణం లాంటిది అనుకుంటాను’’ అంటూ బ్యాగ్ అందించాడు ప్రసన్నంగా.
షాక్ తిన్నాడు అంబరీష్! పోలీసులు చేతులెత్తేశారు. కానీ రుూ మనిషి దేవుడిలాగా దిగివచ్చి నా బ్యాగ్‌నీ లోపలగల నా కంప్యూటర్‌తో సహా అందించాడు. అతని పేరు ‘వీరేష్ నరసింగ్ కాలే’. రైలు భోగీలలో ‘హవుస్ కీపర్’ ఉద్యోగి. ఇల్లు వెదుక్కుంటూ వచ్చాడు. డబ్బులిస్తే ‘‘వద్దు పొమ్మన్నాడు’’. మనిషికి మనిషిగా సాయం చెయ్యడానికి డబ్బులా? ఎందుకూ? అని విసుక్కున్నాడట!
అంబరీష్- ‘‘దేవుడున్నాడు! వీరేష్! దేవుడు వున్నాడయ్యా!’’ అంటూ అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. ‘‘నా జీవితం, నా విశ్వాసం - రెండూ మారిపోయాయ్’’ అంటూ ఫేస్‌బుక్‌మీద రాసుకున్నాడు అంబరీష్!