మెయిన్ ఫీచర్

అంధుల ‘శ్రీయా’భిలాషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీయా అంటే కేవలం సినీనటి అని మాత్రమే అందరికీ తెలుసు. అయితే, ఆమె ఒక సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్ అన్న సంగతి చాలామందికి తెలయదు. తాను కాలేజీలో వున్న రోజులలో ఒక అంధ విద్యార్థి ఆమెకు ఇచ్చిన షాక్, ఆమె నేడు సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్‌గా మారడానికి కారణమై, ఎందరో అంధులకు జీవనభృతిని కల్పిస్తూన్నారు. ఐదు సంవత్సరాల క్రితం శ్రీయాశరన్ ఢిల్లీలో ‘స్పందన్’ పేరిట ఒక ‘స్పా’ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం సెలబ్రిటీలు వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న విషయం సర్వవిదితమే. అయితే శ్రీయా మిగిలిన సెలబ్రిటీస్‌కు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం.
అంధత్వంతో ఇబ్బందిపడుతున్న వారితో ఆమె ‘స్పందన్’ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. స్పందన్ స్పాను ఏర్పాటుచేయడానికి ఒక కారణం వుంది. శ్రీయా ఢిల్లీలో చదువుకొనే సమయంలో ప్రతిరోజూ కాలేజీ అయిపోయిన తరువాత ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన బస్ నెం.427లో డాన్స్ క్లాస్‌కు వెళ్ళేది. ఒకరోజు ఆమెకు బస్ మిస్ అయింది. దాహంగా వుండటంతో ఎదురుగా వున్న పాఠశాలలో మంచినీరు త్రాగడానికి వెళ్ళింది. అదే సమయంలో పాఠశాల ఆటస్థలంలో కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. వారు ఆడుతున్న క్రికెట్ బాల్ శబ్దం చేస్తూ ఉంది. ఆసక్తిగా ఉండటంతో ఆమె వారి ఆటను చూస్తోంది. క్రికెట్ ఆడుతున్న పిల్లలు అంధత్వం కలిగినవారని అర్థం చేసుకోవడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. అదే సమయంలో ఒక బాలుడు ఆమె వద్దకు వచ్చి మాట కలిపాడు. తనకు బస్‌మిస్ అయిందని శ్రీయా చెప్పగానే, ‘‘నేను అంధుడ్ని. అయితే ఎప్పుడూ ఒక్క క్యాచ్ కూడా మిస్ చేయలేదు. మీ అన్ని అంగాలు బాగానే వున్నాయి, అయినా బస్ మిస్ అయ్యారు’’ అని బాలుడు అనగానే షాక్‌తినడం శ్రీయా వంతు అయింది. ఆ సమయంలోనే తాను స్థిరపడిన తరువాత అంధుల కోసం ఏమైనా చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం నుంచి ఆవిర్భవించిందే స్పందన్ స్పా.
స్పా నిర్వహణ కోసం మెళకువలు తెలుసుకోవడం కోసం శ్రీయా, ఆమె తల్లి బ్యాంకాక్‌కు వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. స్పాకు వచ్చే కస్టమర్లను సిబ్బంది చిరునవ్వుతో పలకరిస్తారు. శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వీరు అంకితభావంతో పనిచేస్తారు. దీనివలన స్పాకు వచ్చే కస్టమర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది.
స్పందన్ స్పాలో పనిచేసే సిబ్బంది అందరూ అంధత్వం కలిగినవారే. ఈ స్పా కారణంగా వారు ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, తమ కుటుంబం బాగోగులు చూసుకొంటున్నారు. మన దేశంలో అంధత్వం కలిగినవారు ఎక్కువ. వీరు వారి కుటుంబాలకు భారం కాకుండా, వారి కాళ్ళపై వారు నిలబడేలా (ఆర్థికంగా) చేయాలన్నదే తన లక్ష్యమని శ్రీయా చెబుతారు. సెలవు రోజులలో కూడా తమ సిబ్బంది పనిచేయడానికి వస్తారని, అది పనిపట్ల వారికి ఉన్న అంకితభావానికి చిహ్నమని ఆమె అంటారు.
కేవలం ధనార్జనకే ప్రాధాన్యం ఇవ్వకుండా, ఎందరో అంధులకు ఉపాధి కల్పిస్తూ, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా కృషిచేస్తున్న శ్రీయా అభినందనీయురాలు.
chitram...

స్పందన్‌లో పనిచేసే అంధులతో శ్రీయా

-పి.హైమావతి