Others

స్ర్తిలకు వరం సోయా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ జనాభాలో సగంమంది శిశువులు పాల ఉత్పత్తులను సక్రమంగా జీర్ణం చేసుకోలేకపోతున్నందున అనేక రకాల ఉదర సంబంధ రుగ్మతలకు గురవుతున్నారన్నది ఒక అధ్యయనం. పిల్లలు ఎదుగుతున్నకొద్దీ వారి జీర్ణవ్యవస్థలో లాక్టోజ్ ఉత్పాదక ఎంజైమ్‌లు క్రమంగా కొరవడుతుండటంవల్ల డెయిరీ పాలల్లో
వుండే లాక్టోజును గ్రహించి జీర్ణం చేసుకునే శక్తి సన్నగిల్లుతోంది. ఫలితంగా ఉదర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటువంటివారికి సోయా పాలు మంచి అనువైన ఆహారం. వయసుమీదపడే కొలది ఎముకల్లో శక్తి సన్నగిల్లుతూ కణ నిర్మాణం సడలుతుండటాన్ని శాస్ర్తియంగా ఆస్టయోపోరోసిస్ లక్షణాలుగా గుర్తిస్తారు. ఫలితంగా తొంటి ఎముకలు విరగడం, కీళ్ళ సంబంధ బాధలు పెరగడం జరుగుతుంది.
ముఖ్యంగా మహిళల్లో రుూ సమస్య ఎక్కువగా వుంటుంది. మాంసాహారం అతిగా భుజించటం వంటివి ఇటువంటి ఇబ్బందులకు దారితీస్తున్నాయని అధ్యయనాలు నిర్థారిస్తున్నాయి. అందుకు కారణం మాంసాహారంలోని ప్రొటీన్స్‌వల్ల ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యే కాల్షియం మూత్ర విసర్జన ద్వారా బయటకు వెళ్ళవలసి రావడం. అయితే సోయాలోని మాంసకృతులవలన ఏర్పడే కాల్షియం సక్రమంగా వినియోగింపబడి త్వరగా ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా కాపాడుతుంది. సోయా ఉత్పత్తుల వినిమయం వల్ల మెనోపాజ్ (రుతుస్రావ స్తంభన) లక్షణాలను తగ్గిస్తుంది. నడుము నొప్పులు, ఉన్నట్టుండి చెమటలు పట్టడం, చిరాకు, కండరాల నొప్పులు వంటి అసౌకర్యాలనుంచి ఉపశమనం లభిస్తుంది. స్ర్తిలకు సోయా ఒక వరం అని చెప్పొచ్చు. సోయాబీన్‌లో సహజంగా వుండే ‘ఐసోఫ్లావిన్స్’ ప్రోస్టేట్ సమస్యలను, రొమ్ము కాన్సర్ వంటి తీవ్ర రుగ్మతలను నిలువరిస్తుంది. శరీరానికి సోకే అవకాశం వున్న వివిధ రకాల కాన్సర్ కారకాల బారిన పడకుండా రక్షించడంలో ఐసోప్లావిన్స్ పాత్ర కీలకమైనది.