Others

భీష్మ -- నాకు నచ్చిన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1962లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ బిఎఎస్ ప్రొడక్షన్‌లో బివి సుబ్బారావు నిర్మించి, దర్శకత్వం వహించిన అపురూప మహాభారత దృశ్యకావ్యం -్భష్మ. భీష్మ వృత్తాంతం, శిఖండి కథ, కర్ణుని పాత్ర చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గాంగేయుడిగా ఎన్టీఆర్ నటనకు హద్దుల్లేవనే చెప్పాలి. తండ్రి కోర్కెను నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేసే సన్నివేశం, అంబ తనను వివాహం చేసుకోమన్నప్పుడు ఆమెకు సమాధానం చెప్పడం, ప్రతిజ్ఞ పక్కకు పెట్టి వివాహం చేసుకోమని తల్లి సత్యవతి కోరినపుడు, గురువు పరుశురాముడితో తలపడినపుడు, యుద్ధ నివారణకు కౌరవులకు హితబోధ చేసే సందర్భాల్లోనూ, అరివీర భయంకరంగా యుద్ధంచేసి శిఖండివల్ల అస్తస్రన్యాసం చేసి అర్జునుడి బాణాలకు గాయపడి అంపశయ్యపై పడిపోయినపుడు, తల్లి గంగతో, కర్ణుడితో ఆ సందర్భంలో మాట్లాడినపుడు ఆయన నటన ఉన్నత శిఖరాలు చేరుకుంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న తరుణంలో శిఖండి లాంటి పాత్రను అంగీకరించడమేగాక ఆ పాత్రను రక్తికట్టించిన అంజలీదేవి అభినందనీయురాలు. సాలూరువారి సంగీత దర్శకత్వంలో భీష్ముడికి ఘంటసాల, శ్రీకృష్ణుడికి పిబి శ్రీనివాస్ పాడిన పద్యాలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మహాభారత యుద్ధఘట్టాలు, శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం, గీతోపదేశ ఘట్టంతోపాటు చిత్రంలో ప్రతీ ఫ్రేంలోనూ కెమెరామెన్ ఎమ్‌ఎ రెహమాన్ పనితనం ఆకట్టుకుంటుంది. భీష్మ జననం నుంచి కర్ణుని వధ వరకు ఆసక్తికరంగా తీర్చదిద్దిన దర్శకులు బిఎ సుబ్బారావుగారు అభినందనీయులు. భీష్మ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో తెలియాలంటే ఈతరం వారు చిత్రాన్ని ఆసక్తితో చూడండి.
-సుసర్ల సర్వేశ్వరశాస్త్రి