రాష్ట్రీయం

టిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు: భట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: స్థానిక సంస్ధల కోటా నుంచి రాష్ట్ర శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తేల్చి చెప్పారు. టిఆర్‌ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు. తమ పార్టీ ఎంపిటీసి, జడ్పీటీసీలను టిఆర్‌ఎస్ బెదిరిస్తున్నదని ఆయన ఆరోపించారు. టిఆర్‌ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, బెదిరించినా తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జిహెచ్‌సిసి) అధ్యక్షుడు దానం నాగేందర్ కాంగ్రెస్‌ను వీడరని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అంబేద్కర్ వల్లే దేశానికి పేరు
కొనియాడిన ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్, డిసెంబర్ 6: ప్రపంచంలో భారతదేశ ప్రజాస్వామ్యం గొప్పగా వర్ధిల్లుతున్నదంటే దానికి బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గొప్పదనమే కారణమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కొనియాడారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్ తన వర్ధంతి సందేశాన్ని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశానికి, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని ముఖ్యమంత్రి కొనియాడారు.

తిరుపతి-చెన్నై మార్గంలో మూడు రైళ్లు రద్దు
హైదరాబాద్, డిసెంబర్ 6: చెన్నై-తిరుపతి మధ్య నడిచే మూడు రైళ్లను ఆదివారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి-చెన్నై సెంట్రల్ గరుడాద్రి, తిరుపతి-చెన్నై సెంట్రల్, తిరుపతి-చెన్నై సెంట్రల్ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు తెలిపింది.