భాస్కర వాణి

రానున్న రోజులు భారత్‌వే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తూ అనేక ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. వాణిజ్యం, అంతరిక్షం, చమురు, సహజవాయువు, అణు ఇంధనం, సముద్ర మార్గ రవాణా వంటి కీలక అంశాల్లో భారత్-రష్యాలు సహకరించుకోనున్నాయి. సైనిక ఉత్పత్తుల, విడి భాగాల సంయుక్త తయారీకి సంబంధించిన 2020 ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించాలని మోదీ-పుతిన్‌లు నిర్ణయించుకున్నారు. పనిలో పనిగా కాశ్మీర్ భారత అంతర్గత సమస్యగా రష్యా అభివర్ణించింది. పాకిస్తాన్‌ను వెనకేసుకొస్తున్న చైనాకు విరుగుడుగా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రష్యా మనకు కీలక దేశం. ఇపుడు చైనా, పాక్‌లు తప్ప భారత్‌కు దాదాపు అన్నీ మిత్రదేశాలే. ఆఖరుకు ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న పాత్ర పోషించే సౌదీ కూడా ఇటీవల భారత్‌ను సానుకూల దృక్పథంతో చూడసాగింది. నిజానికి ముందు నుండీ భారత్‌కు రష్యా, ఇజ్రాయిల్ ఎన్నో విషయాల్లో బాసటగా నిల్చాయి. పాలస్తీనాలోని ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీసి ఇజ్రాయిల్‌తో స్నేహం చేస్తే, అక్కడున్న ఆ మతం వాళ్ల మనసులు గాయపడతాయని ఇజ్రాయిల్‌లో కాలుపెట్టని రాజకీయ వ్యవస్థ ఈ డెబ్భై ఏళ్లు నడిచింది. నిజానికి ‘‘మమ్మల్ని అత్యాచారం చేయని ఏకైక జాతి భారతజాతి’’ అని ఇజ్రాయిల్ ప్రకటించింది. 2014 తర్వాత నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు చేస్తుంటే కొందరు ఈ మోదీ విమానం సీటు బెల్టే తీయడంలేదని విమర్శించారు. పరిపక్వత లేని రాహుల్ గాంధీ అయితే ‘సూట్ బూట్ సర్కార్’ అన్నాడు. నిజానికి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ‘మేకిన్ ఇండియా’ థీమ్ ప్రకారం మొదట పాకిస్తాన్‌ను సృష్టించింది. అదే మోదీకి అధికారం ఇస్తే చైనా అధ్యక్షుడిని తీసుకెళ్లి సబర్మతీ ఆశ్రమం అరుగుపై కూర్చోబెట్టాడు.
ఒకవేళ 2014లో మోదీ అధికారంలోకి రాకపోతే అంతర్జాతీయంగా భారత్ చాలా బలహీనమయ్యేది. ఇప్పటివరకున్న ప్రభుత్వాలు ‘విదేశాంగ విధానం’ అనగానే భారత్ జనాభాను చూపించి ఒప్పందాలు కుదుర్చుకునే వ్యాపారం, దానివెనుక జరిగే బ్రోకరిజం, కమీషన్లు మాత్రమే ఉండేవని నిపుణులు చెప్తారు. అది నెహ్రూకాలం జీపుల కుంభకోణం నుండి రాఫెల్ యుద్ధ విమానాల వరకు ఇదే తతంగం నడిచింది. భారత్ పేర్లు పెట్టుకొని ఇక్కడ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు విదేశాలకు తరలించేవి. వాటికి అనుమతులిచ్చే వైట్ కాలర్లు, వాళ్లకు మద్దతుగా నిలిచే ఎన్జీవోలు, వాటికి అండగా నిలిచే రాజకీయ వ్యవస్థ దేశంలో ఎన్నో సమస్యలకు మూలమైంది. హాలెండ్‌కు చెందిన హిందూస్థాన్ లీవర్ 1933లో వ్యాపారం కోసం మన దేశానికి వచ్చి 24 లక్షల పెట్టుబడితో ప్రారంభమై ఇపుడు వేల కోట్లకు పడగలెత్తింది. అలాగే కాల్గేట్ పామోలీవ్, బాటా ఇండియా, సీబాగాయగీ, జాన్సన్ అండ్ జాన్సన్, హేక్ట్స్, బాయర్ రెమిడీస్, పెప్సీ.. లాంటి 5000కు పైగా కంపెనీలు భారత్ ఆర్థిక వ్యవస్థను చిక్కిశల్యం అయ్యేట్లుచేస్తే అవినీతి రాజకీయ నాయకులకు, కుటుంబ పార్టీల నేతలకు ఇవన్నీ రక్షణ కవచాలు. ఇపుడు భారత అంతర్గత రాజకీయ వ్యవస్థకున్న కుటిల బుద్ధి చాలా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా ఇటీవల కాశ్మీర్‌లో 370 రద్దు తర్వాత కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేస్తున్న విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. కమ్యూనిస్టులైతే బరితెగించి ముస్లిం లీగ్‌కన్నా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా దేశంలోని ముస్లింలతో సహా ప్రజలు మేల్కొనకపోతే మనం ప్రమాదంలో పడ్డట్టే. దేశంలో విభజన వాదం చేస్తున్న తుక్డే తుక్డే గ్యాంగ్‌ల అన్ని ఆర్థిక వ్యవస్థలు ధ్వంసం చేసేయాలి. ఈ విభజన వాదానికి మద్దతుగా సిఐఎ నిలిచేది. దానిని బలపరుస్తూ ఓసారి బిల్‌క్లింటన్ వ్యాఖ్య చేశాడు. అంతకుముందే అమెరికాకు చెందిన నాటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ‘‘్భరతదేశం, చైనా మా హిట్‌లిస్ట్‌లో ప్రథమస్థానంలో ఉన్నాయి. సోవియట్ రష్యాను మేం ముక్కలు చేయగలిగాం. ఇక మేం ముక్కలు చేయాల్సినవి భారత్, చైనాలే’’ అని బహిరంగంగా చెప్పాడు. వాస్తవంగా అమెరికా 1776కన్నా ముందు స్థితి ఏంటి? అలాగే 1789కన్నా ముందు ఫ్రాన్స్ ఏంటి? అయినా వారు అనేక పన్నాగాలతో ప్రపంచాధిపత్యం చెలాయిస్తున్నారు.
తాలిబన్లు ‘డబ్ల్యుటివో దాడి’ చేశాక జరిగిన ఇస్లామిక్ స్టేట్ భావనలో అమెరికా చాలా దెబ్బతిన్నది. ఎందుకంటే ఇరాన్, ఇరాక్, ఇరాక్, ఆప్ఘన్‌లో అమెరికా ఇస్లామిక్ టెర్రరిజంతో నేరుగా తలపడాల్సి రావడంవల్ల యూఎస్ ఆర్థికంగా మాంద్యం ఎదుర్కొన్నది. భారత్‌లో కేవలం జాతీయవాదంతో ‘ఇస్లామిక్ స్టేట్’ను ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా ఎదుర్కోవచ్చన్నది ఇటీవల నిరూపితమయ్యింది. నిజానికి విదేశాలకు ఎక్కడికెళ్లినా చైనా వస్తువులు, సంస్కృతి దర్శనం ఇస్తాయని చెప్తారు. విదేశాల్లో ఫుడ్, ఆర్ట్స్, క్రాప్ట్స్, సంస్కృతి.. వంటివి చైనా బాగా ప్రభావితం చేస్తున్నాయని మనం అంతర్జాతీయ విషయాలను గమనంలోకి తీసుకుంటే తెలుస్తుంది. విచిత్రం ఏమిటంటే ఇండోనేషియా, మయన్మార్, థాయ్‌లాండ్, కంబోడియా, లావోస్, మలేసియా, సింగపూర్ వంటి దేశాల్లో మాత్రం భారత సంస్కృతి బ్రతికే ఉంది. ఈ దేశాల్లో బౌద్ధం ఎక్కువుంది. అలాగే చైనాలో అత్యధికుల తాత్వికంగా బౌద్ధం అవలంబిస్తారు. కానీ భారత్ సంస్కృతి వాళ్లను ఈరోజుకూ సవాల్ చేస్తున్నది. భారత్ గొప్పతనాన్ని ప్రముఖ రచయిత హుషీ"That India has culturally dominated and controlled china from two thousand years without sending a single soldier" అన్నాఢు. భారత్‌కున్న బౌద్ధిక, తాత్విక సంపద అంత గొప్పది. నిజానికి భారత్‌లో వెయ్యేళ్ళు దురాక్రమణదారుల పాలననే నడిచింది. అదే భారత ప్రగతికి శాపం అయింది. ఇక్కడి మెజారిటీ ప్రజలను మతం మార్చే ప్రయత్నమే కొనసాగింది. ఇక్కడి సాంస్కృతిక విధ్వంసం, మతపరమైన అణచివేత పట్ల చూపిన శ్రద్ధ దేశం కోసం ఎవరూ చూపలేదు. ముఖ్యంగా విదేశీ చొరబాటుదారులుగా వచ్చిన గజనీ, ఘోరీ, బాబర్, లోడి, తైమూర్, నాదిర్షా.. వాళ్లను అనుసరించిన ఔరంగజేబు వంటి వాళ్లదీ ఇదే పంథా. ఇప్పటికీ ‘ఇస్లామిక్ స్టేట్’ భావనతో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసిస్‌కు మొదటి టార్గెట్ భారతే.
ఒకప్పుడు పర్షియన్- డేరస్ ఆఫ్ పర్షియా, ఇరాన్ సంస్కృతే ప్రపంచ సంస్కృతి అన్నారు. ఆ తర్వాత మెసపటోనియన్, టర్కీ, రోమ్ సంస్కృతులు మేమే గొప్ప అన్నాయి. ఆ తర్వాత పోర్చుగల్ వాళ్లు, ఫ్రెంచ్, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు ప్రపంచంపై చాలా ప్రభావం చూపించాయి. అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, పోలాండ్, జర్మనీ వంటి చిన్నదేశాలు ఆ యుద్ధాన్ని ప్రభావితం చేసాయి. అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో యూఎస్, రష్యా సంయుక్త రాష్ట్రాలు కీలక భూమిక పోషించాయి. పెద్ద భూభాగం, జనాభా, మానవ వనరులున్న దేశాలైనా వీటికి సంస్కృతి లేదు. ఇపుడు వాస్తవంగా ప్రాచీన సంస్కృతి, అతి పెద్ద భూభాగం వున్న భారత్, చైనాలు ప్రపంచంలో మొదటి స్థానానికి పోటీపడుతున్నాయి. ఏ దేశమైనా గొప్పదనడానికి వున్న కొలమానాల్లో సైనిక శక్తి, ఆర్థిక శక్తి, మేధోశక్తి ప్రధానం. ఇపుడు ఈ మూడూ భారత్, చైనాలకు ఇంచుమించుగా ఉన్నాయి. ఒకవేళ అఖండ భారత్ ఏర్పడితే చైనాను భారత్ మించిపోతుంది. అందుకే ముస్లింలను నిర్దాక్షిణ్యంగా ఓవైపు అణచివేస్తున్న చైనా మతతత్వ పాకిస్తాన్ బాసటగా నిలుస్తోంది. అలాగే ప్రపంచ ముస్లింలకు టేకేదార్లమనే పాక్ నాస్తిక చైనా చంకన చేరింది. భారత్ వ్యతిరేకతనే తప్ప ఇంకేం లేదు. అయితే భారత్‌కు చైనాకు లేని నాయకత్వ ‘విలువల’ సంపద వుంది. అదే ఇపుడు భారతదేశానికి శ్రీరామరక్ష.